సాగర్ రాణా అనే యువ రెజ్లర్ మృతి కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ కోసం పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన పోలీసు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. చివరిసారి పంజాబ్ లోని భటిండా జిల్లాలో గల ఓ గ్రామంలో ఇతడు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇతని ఆచూకీ ప్రాథమికంగా అక్కడ ఉన్నట్టు భావిస్తున్నామన్నారు. సుశీల్ అరెస్టుకు దారి తీసే సమాచారం తెలిపినవారికి లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. అలాగే ఇతని సహచరుడైన అజయ్ కుమార్ అనే వ్యక్తిని పట్టించినవారికి 50 వేల రివార్డును కూడా ఇస్తామని వారు పేర్కొన్నారు. సుశీల్ కుమార్ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ దరఖాస్తును ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. ఇతనిపై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని కోర్టు పేర్కొంది. మే 4 వ తేదీ రాత్రి ఢిల్లీలో సుశీల్ కుమార్ కు చెందిన స్టేడియం వద్ద జరిగిన ఘర్షణలో సాగర్ అనే రెజ్లర్ మరణించగా అతని మిత్రులైన సోను, అమిత్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిపై సుశీల్ కుమార్, అతని సహచరులు దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సుశీల్ తో బాటు మరో ఆరుగురి[పై ఢిల్లీ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. మొదట సాగర్ రాణా మరణంతో తనకెలాంటి ప్రమేయం లేదని బుకాయించిన సుశీల్ కుమార్ ఆ తరువాత పరారయ్యాడు.
ఇతగాడు ఆ మధ్య యూపీలోని ఓ బాబా ఆశ్రమంలో తలదాచుకున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ సమాచారం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకునేలోగా అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది.ఒకప్పుడు తన రెజ్లింగ్ స్టయిల్ తో ఇండియాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి ఒలంపిక్ మెడల్ సాధించిన ఈ రెజ్లర్ ఇప్పుడు తాను అరెస్టు కాకుండా ఉండేందుకు నానా పాట్లు పడుతూ తప్పించుకు తిరుగుతున్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: TS Lockdown : అత్యంత కఠినంగా లాక్ డౌన్.. డెలివరీ బాయ్స్‌కు సైతం నో, బయటకొచ్చిన జనం మాటలు విని విస్తుపోతోన్న పోలీసులు
Vaccination: అందుకే వ్యాక్సిన్ కొరత..సంచలన వ్యాఖ్యలు చేసిన సీరమ్ ఇనిస్టిట్యూట్