దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల హృదయాల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఒడిశాలోని సుందర్‌గఢ్‌లో ప్రధాని మోదీపై తన అభిమానాన్ని చాటుకున్నారు ఓ గిరిజన మహిళ. అది చూసిన ప్రధాని మోదీ స్వయంగా భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఒడిశాకు చెందిన ఓ గిరిజన మహిళ అభిమానానికి ప్రధాని మోదీ భావోద్వేగంతో స్పందించారు. ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ కోసం నిరంతరం శ్రమించేలా ‘మహిళా శక్తి’ ఆశీస్సులు తనను ప్రేరేపించాయని అన్నారు. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో ఓ గిరిజన మహిళ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండాకు రూ. 100 పంపించింది. ప్రధాని మోదీ చేసిన పనికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ వంద రూపాయలను పంపుతున్నట్లు తెలిపారు.
బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జై పాండా, మహిళ చిత్రాలను పంచుకుంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్‌ను షేర్ చేస్తూ, శుక్రవారం (అక్టోబర్ 18) పార్టీ సభ్యత్వ ప్రచారం సందర్భంగా, ఒక గిరిజన మహిళ రూ. 100 ఇచ్చారు. ప్రధాని మోదీకి మెసేజ్ పంపమని అభ్యర్థించారు. పదే పదే తిరస్కరిస్తున్నప్పటికీ, ఆమె తన విషయంలో మొండిగా ఉండిపోయానని బైజయంత్ జై పాండా అన్నారు. చివరికి ఆమె కోరికను గౌరవిస్తూ ఈ డబ్బు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇది ఒడిశా తోపాటు భారతదేశంలో జరుగుతున్న మార్పుకు ఇది ప్రతిబింబం అని బిజెపి ఉపాధ్యక్షుడు తన ట్వీట్‌లో రాశారు.
ఈ పోస్ట్‌పై ప్రధాని మోదీ స్పందిస్తూ, ఓ మహిళ తనను ఎంతగానో గౌరవిస్తోందని, తనకు రూ.100 ఇవ్వాలని కోరడంతో ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఈ ఆప్యాయత చాలా ఆకట్టుకుంది. ఈ అభిమానానికి చాలా పొంగిపోయాను అని మోదీ రాశారు. దీని కోసం ఎల్లప్పుడూ తనను ఆశీర్వదించినందుకు మహిళా శక్తికి నమస్కరిస్తున్నాను. వారి ఆశీస్సులు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి నిరంతరం కృషి చేసేందుకు స్ఫూర్తినిస్తున్నాయి అంటూ ప్రధాని మోదీ రాసుకొచ్చారు.
Very touched by this affection. I bow to our Nari Shakti for always blessing me. Their blessings inspire me to keep working to build a Viksit Bharat. https://t.co/Iw8m51zagY
— Narendra Modi (@narendramodi) October 19, 2024
ఈ ఏడాది జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 147 సీట్లున్న ఒడిశా శాసనసభలో 78 సీట్లు గెలుచుకోవడం ద్వారా నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) 24 ఏళ్ల పాలనకు బిజెపి ముగింపు పలికింది. ఈ ఎన్నికల్లో బీజేడీకి 51 సీట్లు వచ్చాయి. మెజారిటీ మార్కు 74 కంటే చాలా వెనుకబడి, కాంగ్రెస్‌కు 14 సీట్లు మాత్రమే వచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా 21 స్థానాలకు గాను 20 స్థానాల్లో బీజేపీ గెలుపొందగా, కాంగ్రెస్‌కు ఒక్క సీటు మాత్రమే దక్కింది. బీజేడీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..