Odisha BJD MLA Prashant Jagdev: యూపీలోని లఖీంపూర్ ఖేరీ ఘటనను గుర్తుచేసేలా.. ఒడిశాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రంలోని ఖోర్ధా జిల్లా బాన్‌పూర్ బ్లాక్ సమీపంలో చిలికా ఎమ్మెల్యే ప్రశాంత్ జగదేవ్ కారు జనంపై దూసుకెళ్లింది. దీంతో చాలామంది గాయపడ్డారు. దీంతో స్థానికులు ఆగ్రహంతో ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిలికా ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్‌దేవ్ కారు శనివారం జనాలపైకి దూసుకెళ్లింది. దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మొత్తం 22 మంది గాయపడ్డారు. వీరిలో 15 మంది బీజేపీ కార్యకర్తలు, ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నట్లు అదికారులు తెలిపారు. ఈ ఘటనలో బానాపుర్ ఇన్‌ఛార్జ్ ఇన్‌స్పెక్టర్ ఆర్‌ఆర్ సాహు సైతం తీవ్రంగా గాయపడ్డారని.. క్షతగాత్రులను భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. ఖుర్దా జిల్లాలో పంచాయతీ సమితి చైర్‌పర్సన్ ఎన్నికలు జరుగుతుండటంతో బానాపుర్ బ్లాక్ ఆఫీస్ ఎదుట పార్టీ పార్టీ కార్యకర్తలు నిలబడి ఉన్నారు. ఈ సమయంలో బిజూ జనతా దళ్ (బీజేడీ) బహిష్కృత ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్‌దేవ్ కారుతో వారిపైకి దూసుకెళ్లారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు ఆ ఎమ్మెల్యేపై దాడికి దిగారు. దీంతోపాటు ఆయన వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. ఘటనా సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారంటూ స్థానికులు పేర్కొంటున్నారు.
Shocking display of power & arrogance by BJD MLA!
I strongly condemn the brutal act by Chilika MLA Prashant Jagdev who plowed his vehicle into a crowd injuring several people.
Strong action should be taken against him as per the law and by the party too. pic.twitter.com/xZs9In1fZn
— Lalitendu Bidyadhar Mohapatra (@LalitenduBJP) March 12, 2022
అనంతరం జగ్దేవ్ను పోలీసులు.. భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో గతేడాది సెప్టెంబరులో జగదేవ్‌ను బీజేడీ సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఖోర్ధా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Over 20 people injured after the suspended BJD MLA Prashant Jagdev’s car allegedly ramped over the crowd in Odisha’s Khordha
“Around 15 BJP workers, a BJD worker and 7 police personnel were injured in the incident. A probe has been initiated into the matter,” said SP Khordha pic.twitter.com/pTAA9S0nwd
— ANI (@ANI) March 12, 2022
Also Read: