National Corona Cases: దేశ వ్యాప్తంగా గడిచిన వారం రోజుల్లో 146 జిల్లాలో కొత్తగా ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 19.5 కోట్లకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ప్రజల సహకారంతోనే కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగామని ఆయన అన్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 11,666 కేసులు నమోదు కాగా, 123 మంది మృతి చెందినట్లు తెలిపారు. ఇక దేశంలో రికవరీ రేటు 96.94 శాతం ఉండగా, మరణాల రేటు 1.44 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే రికవరీ రేటు ప్రపంచంలోనే అత్యధికమని తెలిపింది. దేశంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.
మరోవైపు దేశంలో యూకే రకం కొత్త స్ట్రెయిన్ వైరస్ కేసుల సంఖ్య 165కు చేరింది. కాగా, కరోనా కట్టడిలో భాగంగా భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు సైతం వ్యాక్సిన్ తయారీలో తీవ్రంగా కృషి చేశారు. భారత్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు విజయవంతంగా పని చేస్తున్నాయి. భారత్‌కు చెందిన వ్యాక్సిన్లు ఇతర దేశాలకు సైతం సరఫరా జరుగుతోంది.
Also Read: AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 117 కరోనా కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా