ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌.. స్పందించిన డిప్యూటీ సీఎం మనీష్‌ శిశోడియా.. ఏమన్నారంటే

| Edited By:

Nov 18, 2020 | 11:42 AM

దేశరాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండం కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ మూడో దశ కొనసాగుతుండగా.. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది

ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌.. స్పందించిన డిప్యూటీ సీఎం మనీష్‌ శిశోడియా.. ఏమన్నారంటే
Follow us on

covid 19 delhi lockdown: దేశరాజధాని ఢిల్లీలో కరోనా విలయతాండం కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ మూడో దశ కొనసాగుతుండగా.. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయని పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలో వాటిపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ శిశోడియా స్పందించారు. ఢిల్లీలో లాక్‌డౌన్‌ గానీ మినీ లాక్‌డౌన్‌గానీ విధించే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. (నటి గౌతమి ఇంట్లోకి చొరబడి.. గోడ కింద దాక్కొని.. ఆందోళన కలిగించిన వ్యక్తి)

పండుగ నేపథ్యంలో పలు మార్కెట్లు రద్దీగా మారాయని.. దీంతోనే కేసుల సంఖ్య పెరుగుతోందని.. పండుగ సీజన్ ముగిశాక కేసులు తగ్గుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. కేసుల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కాగా మంగళవారం రోజు మాట్లాడినఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రద్దీగా ఉండే పలు మార్కెట్లను మూసివేయాలనుకుంటున్నామని తెలిపారు. దీనిపై కేంద్రానికి ఓ ప్రపోజల్‌ పంపామని ఆయన వెల్లడించారు. (సోమాలియా రాజధాని మొగదిషులో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు మృతి)