సుశాంత్ మృతితో నాకేంటి సంబంధం, ఆదిత్య థాక్రే

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుతో తనకు సంబంధం లేదని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే కుమారుడు, మంత్రి కూడా అయిన ఆదిత్య థాక్రే అన్నారు. ఏ కారణం లేకుండానే..

సుశాంత్ మృతితో నాకేంటి సంబంధం, ఆదిత్య థాక్రే

Edited By:

Updated on: Aug 05, 2020 | 5:36 PM

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుతో తనకు సంబంధం లేదని మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే కుమారుడు, మంత్రి కూడా అయిన ఆదిత్య థాక్రే అన్నారు. ఏ కారణం లేకుండానే తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సుశాంత్ మృతి తరువాత ‘చెత్త రాజకీయాలు’ చేస్తున్నారని మండిపడ్డారు. నిరాశా నిస్పృహల కారణంగా రాజకీయ కడుపు మంటతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, అయినా తాను వీటికి బెదిరేది లేదని ఆయన చెప్పారు. సుశాంత్ మరణం వెనుక కొందరు రాజకీయ నేతల హస్తం ఉండవచ్ఛునని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆదిత్య థాక్రే ఈ ‘ప్రకటన’ చేశారు.

నటుడు సుశాంత్ మృతికి, ఆదిత్య థాక్రేకి లింక్ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ప్రతిపక్షాలకు మంచి ‘అస్త్రం’ దొరికిందని, కానీ  దాన్ని ఎలా తిప్పికొట్టాలో తమకు తెలుసునని ఆయన  అన్నారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us