
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌తో ఇప్పటికే దేశంలో పవర్ పెట్రోల్ ధరలు పెరిగాయి.. ఈ తరుణంలో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసేంది. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడం లేదని క్లారిటీ ఇచ్చింది.
పెట్రోల్ , డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారంలో నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరగుతున్నప్పటికి భారత్‌లో పెట్రోల్ , డీజిల్ ధరలు పెంచే ఉద్దేశం లేదని పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్రజలు ప్యానిక్ బుకింగ్ చేయవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. దేశంలో రెండు నెలలకు సరిపడ పెట్రో నిల్వలు ఉన్నాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతశర్మ వెల్లడించారు.
అంతేకాదు డొమెస్టిక్ LPG ధరలు కూడా పెంచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రజలు అనవరసరంగా సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మి టెన్షన్ పడవద్దని, ఏదైనా సరే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నమ్మాలని చెప్పుకొచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి