Farmers Protest: దయచేసి ఆ పుకార్లను నమ్మకండి.. ప్రజలకు విజ్ఞప్తి చేసిన పోలీసులు..

|

Feb 01, 2021 | 11:01 PM

Farmers Protest: రైతుల ఆరెస్టులకు సంబంధించి పుకార్లు సృష్టించవద్దని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు సోమవారం నాడు..

Farmers Protest: దయచేసి ఆ పుకార్లను నమ్మకండి.. ప్రజలకు విజ్ఞప్తి చేసిన పోలీసులు..
Follow us on

Farmers Protest: రైతుల ఆరెస్టులకు సంబంధించి పుకార్లు సృష్టించవద్దని ఢిల్లీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు సోమవారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. భారత గణతంత్ర దినోత్సవం రోజులు రైతుల నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక మంది రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి, వారి ఆచూకీ కూడా చెప్పకుండా దాచిపెట్టారంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. ఈ నేపథ్యంలో స్పందించిన ఢిల్లీ పోలీసులు.. రైతుల అరెస్టులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేశారు. ఏ ఒక్కరినీ చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. రైతు ఉద్యమంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు 44 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయగా.. 122 మందిని అరెస్ట్ చేశామని ఢిల్లీ పోలీసు అధికారి ఈష్ సింఘాల్ వెల్లడించారు. అరెస్టైన వారి వివరాలు కూడా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచామని చెప్పారు. కావాల్సివస్తే ఎవరైనా సరే వాటిని చూడొచ్చని ఆయన పేర్కొన్నారు. పోలీసులు ఇప్పటి వరకు ఎవరినీ చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకోలేదని మరోమారు ఉద్ఘాటించిన ఆయన.. పుకార్లను నమ్మవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కాగా, గణతంత్ర దినోత్సం రోజున ఢిల్లీలో చోటు చేసుకున్న హింసాకాండకు సంబంధించిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న వారందరినీ విడుదల చేసేలా పోలీసులను ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సింఘు, తిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులను పోలీసులు చట్ట విరుద్ధంగా నిర్బంధించారని, వారందరినీ విడుదల చేసేలా ఆజ్ఞాపించాలని ఆ పిల్‌లో పిటిషనర్ కోరారు. ఈ అభ్యర్థనపై ఢిల్లీ హైకోర్టులో మంగళవారం నాడు విచారణ జరగనుంది.

Also read:

Elon Musk : బిట్ కాయిన్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించిన టెస్లా సీఈఓ ఈలాన్ మస్క్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం.. మంత్రాలు చేస్తున్నాడన్న నెపంతో వ్యక్తి హత్య..