Nithyananda: ఆన్‌లైన్‌లోనే భక్తులకు దర్శనాలు, దీవెనలు.. స్వామి నిత్యానంద సంచలన ప్రకటన

|

Aug 18, 2021 | 4:30 PM

అత్యంత పురాతనమైన శైవ మఠాల్లో ఒక్కటైన తమిళనాడులోని మధురై అధీనంపై వివాదాస్పద స్వామి నిత్యానంద సంచలన ప్రకటన చేశారు. శతాబ్ధాల చారిత్రక నేపథ్యం కలిగిన మధురై అధీన మఠానికి 293వ మఠాధిపతి తానేనంటూ ఆయన ప్రకటించుకున్నారు.

Nithyananda: ఆన్‌లైన్‌లోనే భక్తులకు దర్శనాలు, దీవెనలు.. స్వామి నిత్యానంద సంచలన ప్రకటన
Nithyananda
Follow us on

Nithyananda: అత్యంత పురాతనమైన శైవ మఠాల్లో ఒక్కటైన తమిళనాడులోని మధురై అధీనంపై వివాదాస్పద స్వామి నిత్యానంద సంచలన ప్రకటన చేశారు. శతాబ్ధాల చారిత్రక నేపథ్యం కలిగిన మధురై అధీనం 293వ మఠాధిపతిగా ఆన్‌లైన్‌లో ప్రమాణ స్వీకారం చేసినట్లు ఆయన ప్రకటించుకున్నారు. మధురై ఆధీనం మఠాధిపతి అరుణగిరి నాథన్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మదురైలోని అపోలో ఆస్పత్రిలో గతవారం శివైక్యం చెందారు. దీంతో అరుణగిరి నాథన్ వారసుడిగా మధురై ఆధీనం 293వ మఠాధిపతిగా జ్ఞానసంబంధ పరమాచార్య స్వామి నియమితులయ్యారు. అయితే మధురై ఆధీనం తదుపరి మఠాధిపతిగా ఆన్‌లైన్‌లో ప్రమాణ స్వీకారం చేసినట్లు నిత్యానంద తనకు తాను ప్రకటించుకోవడం శైవ మఠాధిపతుల మధ్య తీవ్ర చర్చనీయాంశమయ్యింది.

ఇకపై మధురై ఆధీనం పీఠాధిపతి హోదాలో ఆన్‌లైన్ ద్వారానే భక్తులకు దర్శనాలు, దీవెనలు అందించనున్నట్లు స్వామి నిత్యానంద తన ప్రకటనలో తెలిపారు. తన పేరును 293వ జగద్గురు మహా సన్నిధానం శ్రీ లశ్రీ భగవాన్ నిత్యానందగా పరమశివ జ్ఞానసంబంధ దేశిక పరమాచార్య స్వామిగా మర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. మధురై ఆధీనంకు సంబంధించిన రోజువారీ వ్యవహారాలను కూడా ఆన్‌లైన్ ద్వారానే పర్యవేక్షిస్తానని తెలిపారు. అధీనానికి సంబంధించిన పూర్తి నిర్ణయాలపై తనదే తుది నిర్ణయంగా ఉంటుందని నిత్యానంద తన లేఖలో స్పష్టంచేశారు.

Nithyananda

తమిళనాడులోని అత్యంత పురాతనమైన మఠాల్లో మధురై ఆధీనం కూడా ఒకటి. ఆ మఠానికి 292వ పీఠాధిపతిగా 1980 సంవత్సరం నుంచి అరుణగిరి నాథన్ సేవలందించారు. గతంలో మధురై అధీనం అరుణగిరి నాథన్‌తో నిత్యానందకు సన్నిహిత సంబంధాలుండేవి. ఆధీనాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకొని మఠం ఆస్తులని, విలువైన మరకత లింగాన్ని అక్రమంగా తరలించినట్టు కొన్నేళ్ల క్రితం వీడియోలు భయపడడంతో నిత్యానంద అధీనాన్ని వదిలి వెళ్లారు. మధురై ఆధీనంకు నిత్యానంద యువ పీఠాధిపతిగా 2012 ఏప్రిల్ 27న అరుణగిరి నాథన్ ప్రకటించగా… అప్పట్లో ఆ ప్రకటనపై తీవ్ర దుమారంరేగడంతో తన ప్రకటనను ఆయన ఉపసంహరించుకున్నారు.

Also Read..

తన కన్నా 5 ఏళ్ల చిన్నవాడితో కత్రినా కైఫ్ సీక్రెట్ ఎంగేజ్‌‌మెంట్.. ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా..

తాలిబన్లకు భారత్ దౌత్యపరమైన గుర్తింపు ఇస్తుందా? దౌత్యపరమైన గుర్తింపు..దాని ప్రాధాన్యత తెలుసుకోండి!