మహారాష్ట్ర రాయగడ్ జిల్లాలోని మహద్ ప్రాంతంలో బహుళ అంతస్థుల భవనం కూలిన ఘటనలో మరణించినవారి సంఖ్య 9 కి పెరిగింది వీరిలో నలుగురు పురుషులు, అయిదుగురు మహిళలు ఉన్నారు. . శిథిలాలకింద అనేకమంది చిక్కుకునిపోగా, పలువురి ఆచూకీ తెలియడంలేదు. 20 గంటలకు పైగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. 60 మందికి పైగా వ్యక్తులను రక్షించినట్టు అధికారులు తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు చెందిన మూడు బృందాలు, అగ్నిమాపక శాఖకు చెందిన 12 టీములు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి, దాదాపు పదేళ్ల క్రితం నాటి ఈ బిల్డింగ్ లో 45 ఫ్లాట్లు ఉన్నాయి, ఈ ఘటనకు కారకులని భావిస్తున్న కాంట్రాక్టర్ యూనస్ షేఖ్, ఆర్కిటెక్ట్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.