NIA Arrests Al Qaeda:11 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులపై చార్జిషీట్‌ దాఖలు చేసిన ఎన్‌ఐఏ.. భగ్నమైన కుట్రలు..

NIA Arrests 11 Al Qaeda: జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ తాజాగా పశ్చిమ బెంగాల్‌, కేరళకు చెందిన అల్‌-ఖైదాకు చెందిన 11 మంది ఉగ్రవాదులపై చార్జిషీట్‌ దాఖలు చేసింది. మర్షిద్‌ నాయకత్వంలో పశ్చిమ బెంగాల్‌, కేరాళ రాష్ట్రాల్లో..

  • Narender Vaitla
  • Publish Date - 6:28 pm, Fri, 26 February 21
NIA Arrests Al Qaeda:11 మంది అల్‌ఖైదా ఉగ్రవాదులపై చార్జిషీట్‌ దాఖలు చేసిన ఎన్‌ఐఏ.. భగ్నమైన కుట్రలు..

NIA Arrests 11 Al Qaeda : జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ తాజాగా పశ్చిమ బెంగాల్‌, కేరళకు చెందిన అల్‌-ఖైదాకు చెందిన 11 మంది ఉగ్రవాదులపై చార్జిషీట్‌ దాఖలు చేసింది. మర్షిద్‌ నాయకత్వంలో పశ్చిమ బెంగాల్‌, కేరాళ రాష్ట్రాల్లో పనిచేస్తున్న అల్‌ ఖైదా ప్రేరేపిత ఉగ్రవాదులకు సంబంధించి అందిన రహస్య సమాచారం మేరకు ఈ కేసును ఎన్‌ఐఏ నమోదు చేసింది.
ఈ ఉగ్రవాదలకు సంస్థకు చెందిన వారు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు కుట్ర పన్నుతున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే ఎన్ఐఏ దేశంలో అల్‌ఖైదా సానుభూతులను అరెస్ట్‌ చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా కేరళ, బెంగళూరులో దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఏకంగా తొమ్మిది మంది ఉగ్రవాదులను అరెస్ట్‌ చేశారు. అలాగే ఈ సంఘటన జరిగిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా ఎన్ఐఏ అధికారులు చేప్టటిన దాడుల్లో.. ముర్షిద్‌ హసన్‌ అనే ఉగ్రవాది పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌కు చెందిన అల్‌ఖైదా హ్యాండ్లర్స్‌ నుంచి పలు ఆదేశాలతో పాటు సోషల్‌ మీడియా ద్వారా కొన్ని ఎక్‌క్రిప్టెడ్‌ మెసేజ్‌లను అందుకున్నట్లు అధికారులు గుర్తించారు.
ముర్షిద్‌ హసన్‌ తన ఇతర అనుచరులతో కలిసి అల్‌ఖైదాలో ఎక్కువ మందిని చేర్చుకున్నేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. భారత్‌లో ఆశాంతి సృష్టించడమే లక్ష్యంగా సోషల్‌ మీడియా వేదికగా ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలను చేరవేస్తున్నట్లు గుర్తించారు. ఇక దర్యాప్తులో తేలిన మరిన్ని వివరాల ప్రకారం.. అల్‌ఖైదా గ్రూప్‌నకు చెందిన వ్యక్తులు కాఫీర్స్‌లుగా భావిస్తున్న వారిపై దాడికి దిగడాన్ని సన్నాహాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఇక ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలు కోసం నిధులు సమకూర్చుకోవడానికి పలు సార్లు వరుస సమావేశాలు నిర్వహించారని అధికారుల దర్యాప్తులో తేలింది. ఎన్‌ఐఏ అధికారులు దాడుల్లో పట్టుబడిన వారు న్యూఢిల్లీలోని ఓ ఆయుధాల డీలర్‌తో నిత్యం టచ్‌లో ఉన్నారని తేలింది. ఏదిఏమైనా ఎన్‌ఐఏ అధికారులు సకాలంలో స్పందించడంతో ఉగ్రవాదుల దుశ్చర్యలకు అడ్డుకట్టవేసినట్లు అయ్యింది. ఒకవేళ ఈ ఉగ్రమూక గనుక అరెస్టై ఉండి ఉండకపోతే.. ఎలాంటి అల్లర్లు చెలరోగేవో అన్న ఆలోచనే అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి.

Also Read: West Bengal Electionsl Date 2021: పశ్చిమబెంగాల్‌లో మోగిన ఎన్నికల నగారా.. మొత్తం 8 దశల్లో పోలింగ్‌.. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

CTET Results Out: విడుదలైన ‘సీ టెట్‌’ పరీక్ష ఫలితాలు.. అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలివే..