NIA: వాళ్లందరిని అండమాన్ జైలుకు పంపించండి.. కేంద్రాన్ని కోరిన ఎన్‌ఐఏ

|

Jul 02, 2023 | 8:33 PM

నార్త్ ఇండియాలో పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న కొంతమంది ఖైదీలను అండమాన్ కేంద్ర కారాగారానికి పంపాలని జాతీయ దర్యాప్తు సంస్థ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. తిహాడ్ జైలులో ఉన్న సుమారు 10 నుంచి 12 మంది నేరగాళ్లను వెంటనే అక్కడికి పంపించాలని కోరింది.

NIA: వాళ్లందరిని అండమాన్ జైలుకు పంపించండి.. కేంద్రాన్ని కోరిన ఎన్‌ఐఏ
Jail
Follow us on

నార్త్ ఇండియాలో పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న కొంతమంది ఖైదీలను అండమాన్ కేంద్ర కారాగారానికి పంపాలని జాతీయ దర్యాప్తు సంస్థ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. తిహాడ్ జైలులో ఉన్న సుమారు 10 నుంచి 12 మంది నేరగాళ్లను వెంటనే అక్కడికి పంపించాలని కోరింది. ఇలా ఎందుకు చేయాలని కోరుతున్నామో కూడా వివరణ ఇచ్చింది. కొంతమంది నేరగాళ్లు జైల్లో ఉంటూనే గ్యాంగులు మెయింటెన్ చేస్తున్నారని స్పష్టం చేసింది . మరో విషయం ఏంటంటే అండమాన్ దీవులు కేంద్రం పరిధిలో ఉండటం వల్ల నేరగాళ్లను అక్కడికి తీసుకెళ్లేందుకు మిగతా రాష్ట్రాలల లాగ ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన పని లేదని లేఖలో తెలిపింది. అయితే ఈ నేరగాళ్ల తరలింపుపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖను అభ్యర్థిస్తూ లేఖ రాయడం ఎన్‌ఐఏకు రెండోసారి కావడం గమనార్హం.

ఇటీవల పంజాబ్‌‌కి చెందిన సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకేసులో ప్రధాన నిందితుడైన లారెన్స్‌ బిష్ణోయ్‌ తో పాటు మరో 25 మంది నేరస్థులను దక్షిణభారత్‌లోని వివిధ జైళ్లకు తరలించాలని కోరుతూ కొన్ని నెలల క్రితం ఎన్‌ఐఏ కేంద్రానికి లేఖ రాసింది. తిహాడ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్‌ టిల్లు తాజ్‌పురియాను హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ హత్య అనంతరం ఆ జైలులో శిక్ష అనుభవిస్తున్న కరుడుగట్టిన నేరస్తులను ఇతర జైళ్లకు తరలించాలని తిహాడ్‌ జైలు అధికారులు కూడా కూడా హోం మంత్రిత్వశాఖకు లేఖ రాశారు. ఇదిలా ఉండగా తిహాడ్ కేంద్రకారాగరం పరిధిలోని సుమారు 16 జైళ్లు ఉన్నాయి. వీటిలో మొత్తం 10 వేల మంది ఖైదీలను మాత్రమే ఉంచేందుకు సదుపాయం ఉంది. కానీ ప్రస్తుతం దాదాపు 20 వేల మందికి పైగా నేరస్థులు శిక్ష అనుభవిస్తున్నారు. దీనివల్ల జైలులో శాంతిభద్రతలు లేకుండా పోతున్నాయని జైలు అధికారులు వాపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..