‘అవిగో యుఎఫ్ఓలు..అమెరికన్ నేవీ యుధ్ధ విమానాలతో ఎన్ కౌంటర్లు’ !

| Edited By: Ravi Kiran

May 14, 2020 | 7:01 PM

యుఎస్ నేవీ యుధ్ధ వివిమానాలకు. నింగిలో ‘గుర్తు తెలియని వస్తువులకు.(యుఎఫ్ ఓలు) మధ్య జరిగిన ‘ఎన్ కౌంటర్’ తాలూకు ఘటనలను పెంటగాన్ డీక్లాసిఫై చేసి మూడు వీడియోలను గత నెలలో విడుదల చేసింది. అతి చిన్న విమానం వంటివి చాలా చిన్న సైజులో ఉన్నాయని, అవి వెండి రంగులో సుమారు సూట్ కేసంత పరిమాణంలో ఉన్నాయని ఒక నివేదిక తెలిపింది. అది వివిధ సంవత్సరాల్లో. వివిధ తేదీల్లో జరిగిన ఘటనలు.  2014 మార్చి 26 న నేవీ […]

అవిగో యుఎఫ్ఓలు..అమెరికన్ నేవీ యుధ్ధ విమానాలతో ఎన్ కౌంటర్లు !
Follow us on

యుఎస్ నేవీ యుధ్ధ వివిమానాలకు. నింగిలో ‘గుర్తు తెలియని వస్తువులకు.(యుఎఫ్ ఓలు) మధ్య జరిగిన ‘ఎన్ కౌంటర్’ తాలూకు ఘటనలను పెంటగాన్ డీక్లాసిఫై చేసి మూడు వీడియోలను గత నెలలో విడుదల చేసింది. అతి చిన్న విమానం వంటివి చాలా చిన్న సైజులో ఉన్నాయని, అవి వెండి రంగులో సుమారు సూట్ కేసంత పరిమాణంలో ఉన్నాయని ఒక నివేదిక తెలిపింది.

అది వివిధ సంవత్సరాల్లో. వివిధ తేదీల్లో జరిగిన ఘటనలు.  2014 మార్చి 26 న నేవీ యుధ్ధ విమానమొకటి ఆ వస్తువుకు దాదాపు వెయ్యి అడుగుల దూరం వరకు వెళ్లిందని, కానీ చిన్న విమానం వంటి దాన్ని పైలట్ గుర్తించలేకపోయాడని ఈ రిపోర్టు పేర్కొంది. బహుశా ఇలాంటివి యుఎఫ్ఓలే అయి ఉంటాయని భావిస్తున్నారు. 2013, 2019 సంవత్సరాల్లో కూడా ఈ విధమైనవి కనిపించాయంటున్నారు. ఈ నివేదికలు ప్రస్తుతం యుఎఫ్ఓలకు సంబంధించిన చర్చను మళ్ళీ తెరపైకి తెస్తున్నాయి.