ఈ భూతలంపై సముద్ర మట్టాలు క్రమేపీ పెరుగుతున్నాయని, దీని ప్రభావం మొదట అంచనా వేసినదానికన్నా తాజా ఎస్టిమేషన్ ప్రకారం మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని ఓ కొత్త స్టడీ.. షాకింగ్ న్యూస్ వెల్లడించింది. అయితే ఇప్పట్లో కాదు.. 2050 నాటికి ముఖ్యంగా ప్రపంచంలోని కోస్తా తీర నగరాలకు జలగండం పొంచి ఉందని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. సముద్ర మట్టాలు పెరిగిపోవడం, గ్లోబల్ హీట్ వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా వాల్డ్ లోని అనేక కోస్తా తీర నగరాలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని న్యూజెర్సీ లోని క్లైమేట్ సెంట్రల్ అనే రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది. తమ అధ్యయన ఫలితాలను ఈ బృందం ‘ నేచర్ కమ్యూనికేషన్స్ ‘ అనే జర్నల్ లో ప్రచురించింది. శాటిలైట్ రీడింగ్స్,, సముద్ర అధ్యయనాల ఆధారంగా ఈ బృందం ప్రపంచంలో సముద్ర మట్టాలు పెరుగుతున్న తీరును విశ్లేషించింది. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని ఈ బృందం అభిప్రాయపడింది. ఈ భూమండలంపైని 150 మంది మిలియన్ ప్రజలపై దీని ప్రభావం పడవచ్ఛు. 2050 నాటికి వియత్నాం లోని 20 మిలియన్ల మంది, థాయిలాండ్ లో 10 శాతానికి పైగా ప్రజలు, చైనాలోని షాంగైలో భారీ సంఖ్యలో ప్రజలు ఈ ‘ బెడద ‘ ను ఎదుర్కొనవచ్ఛునని ఈ పరిశోధకులు అంచనా వేశారు. ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవచ్చు.. అలాగే ఇరాక్ లోని బాస్రా కు కూడా ముప్పు పొంచి ఉంది అని రీసెర్చర్లు పేర్కొన్నారు.
ముంబైకీ తప్పని ముప్పు
2050 నాటికి భారత ఆర్ధిక వాణిజ్య నగరం ముంబై కి కూడా జలగండం పొంచి ఉన్నట్టు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనే సంస్థ వెల్లడించింది. సముద్ర తీరానికి అతి దగ్గరగా ఉన్న ఈ నగరం కూడా దాదాపు ‘ హిట్ లిస్ట్ ‘ లో ఉన్నట్టే అని ఈ సంస్థ అభిప్రాయపడింది. ఈ కారణంగా ఇప్పటినుంచే ప్రజలను రీ-లొకేట్ చేసే ప్రక్రియపై దృష్టి పెట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు.