శరద్ పవార్, అనిల్ దేశ్ ముఖ్ లకూ బెదిరింపు కాల్స్ !

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకి బెదిరింపు కాల్ అందినట్టు వచ్చిన వార్త రేపిన సంచలనం ఇంకా మరవకముందే ఎన్సీపీ నేత శరద్ పవార్, రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ లకు కూడా సోమవారం బెదిరింపు కాల్స్ అందాయి.

శరద్ పవార్, అనిల్ దేశ్ ముఖ్ లకూ బెదిరింపు కాల్స్ !

Edited By:

Updated on: Sep 07, 2020 | 6:10 PM

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకి బెదిరింపు కాల్ అందినట్టు వచ్చిన వార్త రేపిన సంచలనం ఇంకా మరవకముందే ఎన్సీపీ నేత శరద్ పవార్, రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ లకు కూడా సోమవారం బెదిరింపు కాల్స్ అందాయి. దేశం బయటినుంచి  వీరి నివాసాలకు ఈ కాల్స్ అందినట్టు తెలుస్తోంది. పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. రాష్ట్రంలో సాక్షాత్తూ హోం మినిష్టర్ కి, ఎన్సీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ కు ఇలా బెదిరింపు కాల్స్ రావడం పెద్ద చర్చనీయాంశమైంది. కాగా ఈ కాల్స్ విషయమై ఈ ఇద్దరు నేతలూ స్పందించలేదు.

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తరఫున మాట్లాడుతున్నానంటూ నిన్న రాత్రి పదిన్నర గంటల సమయంలో అజ్ఞాత వ్యక్తి ఏకంగా సీఎం ఉధ్ధవ్ థాక్రే  నివాసానికే ఫోన్ చేయడాన్ని ఏదో ఆకతాయి ఫేక్ కాల్ గా శివసేన నేతలు పేర్కొంటున్నప్పటికీ తాజాగా ఈ ఇద్దరు నేతలకు కూడా సోమవారం బెదిరింపు కాల్స్..అది కూడా దేశం బయటి నుంచి రావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us