Navneet vs Thakrey: మరోసారి చిక్కుల్లో పడ్డారు అమరావతి ఎంపీ నవనీత్. బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆమెపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేయబోతోంది మహా సర్కార్.
అమరావతి ఎంపీ నవనీత్ రాణా దూకుడును మరింత పెంచారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకు సవాల్ విసిరారు. మీపై ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా? గెలుపు నాదే అంటూ ఉద్దవ్ థాక్రేకు ఛాలెంజ్ విసిరారు నవనీత్. సవాల్‌కు సిద్దమా అంటూ ప్రశ్నించారు. హనుమాన్ చాలీసా పఠించడమే నేరం అయితే, మరోసారి పఠించడానికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు నవనీత్‌కౌర్.
నవనీత్ చేసిన ఈ కామెంట్స్ రచ్చ జరుగుతోంది. నవనీత్ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మాట్లాడినట్టు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబోతున్నారు పోలీసులు. జైలు నుంచి విడుదలైన తరువాత ఈ అంశంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదన్న షరతును కోర్టు విధించిందని, ఆ షరతును నవనీత్ ఉల్లంఘించిందని అంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ నవనీత్ రాణా దంపతుల ఇంట్లో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తనిఖీలు చేయబోతున్నారు. ఖార్‌లోని ఫ్లాట్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు రాణా దంపతులకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత వారం తనిఖీల కోసం వచ్చినప్పుడు ఇంటికి తాళం వేసి ఉండడంతో వెనక్కివెళ్లిపోయారు. అటు ఆమె చేసిన కామెంట్స్‌పై శివసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆమె బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు శివసేన నేతలు.