National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. రూ. 750 కోట్ల విలువైన ఆస్తుల జప్తు!

నేషనల్ హెరాల్డ్ కేసులో, మనీలాండరింగ్ ఆరోపణల కింద కాంగ్రెస్‌కు చెందిన AJL, యంగ్ ఇండియన్‌లకు చెందిన రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో ఢిల్లీ, ముంబై, లక్నో సహా పలు ప్రాంతాల్లో ఏజేఎల్‌కు ఆస్తులు ఉన్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది.

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. రూ. 750 కోట్ల విలువైన ఆస్తుల జప్తు!
National Herald Case

Updated on: Nov 21, 2023 | 8:23 PM

నేషనల్ హెరాల్డ్ కేసులో, మనీలాండరింగ్ ఆరోపణల కింద కాంగ్రెస్‌కు చెందిన AJL, యంగ్ ఇండియన్‌లకు చెందిన రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ జప్తు చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో ఢిల్లీ, ముంబై, లక్నో సహా పలు ప్రాంతాల్లో ఏజేఎల్‌కు ఆస్తులు ఉన్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థ తెలిపింది. దీని మొత్తం ధర రూ.661.69 కోట్లు.

యంగ్ ఇండియన్ ఆస్తి విలువ రూ.90.21 కోట్లు అని సోషల్ మీడియాలో ఈడీ ప్రకటన విడుదల చేసింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇలా చేస్తోందని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. వాస్తవానికి ఈ కంపెనీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు వాటాలు ఉన్నాయి.

ఇదిలావుంటే ED చర్యపై, కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ స్పందించారు. ఎజెఎల్ ఆస్తులను ED అటాచ్ చేసినట్లు వార్తలు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో ఖచ్చితంగా ఓటమి నుండి దృష్టిని మరల్చడానికేనని మండిపడ్డారు సంఘ్వీ. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో ఎన్నికల్లో తమ ఓటమిని ఆపలేవని అన్నారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీన్ని కొట్టిపారేసిన బీజేపీ.. పక్కా ఆధారాలతోనే కేంద్ర ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయని అంటున్నారు.

5 రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రాజస్థాన్, తెలంగాణలో నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.

నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక వ్యవహారం ఇదీ !

ఏఐసీసీ ఆధ్వర్యంలోని నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ప్రస్తుత ‘యంగ్‌ ఇండియన్‌’ ప్రైవేటు లిమిటెడ్‌ అధీనంలో ఉంది. దానిని ప్రచురించే సంస్థ పేరు అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌). యంగ్‌ ఇండియన్‌ కంపెనీకి రాహుల్‌, సోనియా ప్రమోటర్లుగా ఉన్నారు. అందులో చెరో 38 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ కేవలం రూ.50 లక్షలే చెల్లించి.. ఏజేఎల్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన రూ.90.25 కోట్ల రుణాన్ని రికవరీ చేసే హక్కు పొందడంపై బీజేపీ ఎంపీ సుబ్రమణ్యంస్వామి 2013లో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు.

సోనియా, రాహుల్‌ తదితరులు మోసంతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. గత ఏడాది ఈడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి ప్రస్తుతం విచారణ జరుపుతోంది. ఇటివలే సోనియా, రాహుల్‌ను ప్రశ్నించింది. ఏజేఎల్‌కు రూ.800 కోట్ల ఆస్తులు ఉన్నాయని.. యంగ్‌ ఇండియన్‌ లాభదాయక సంస్థ కాకపోతే దాని భూములు, భవనాలను అద్దెకు ఇవ్వడం వంటి వాణిజ్య కార్యకలాపాలు ఎలా చేపడుతోందని ఈడీ  విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా AJL, యంగ్ ఇండియన్‌లకు చెందిన ఆస్తులను జప్తు చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…