Narendra Modi In Varanasi: వారణాసిలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు. ఓ సామాన్య వక్తిని దగ్గరికి పిలిచి ఆ వ్యక్తి నుంచి తలపాగా, శాలువా తీసుకున్నారు. అనంతరం అతనికి నమస్కరించి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం నాడు కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సాన్ని పురస్కరించుకుని వారణాసిలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా హర హర మహాదేవ, మోదీ, మోదీ నామ స్మరణలతో వారణాసి వీధులన్నీ మారుమ్రోగిపోయాయి. తొలుత వారణాసి వీధుల గుండా ర్యాలీగా వచ్చిన మోదీకి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఆయన వాహన శ్రేణిపై పూలు జల్లు కురిపిస్తూ జేజేలు పలికారు.
అయితే, ఈ సమయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆయన ర్యాలీగా వస్తుండగా.. ఆయనను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి.. ప్రధాని మోదీకి తలపాగా, శాలువా బహుకరించేందుకు ప్రయత్నించాడు. అయితే, భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. అది గమనించిన ప్రధాని మోదీ.. భద్రతా సిబ్బందికి సర్దిచెప్పి.. ఆ వ్యక్తిని దగ్గరికి పిలిచారు. అతని నుంచి తలపాగా, శాలువా స్వీకరించి ధన్యవాదాలు తెలిపారు. ఇదిలాఉంటే.. ఈ ర్యాలీ సందర్భంగా కొంత దూరం వెళ్లాక వారణాసిలోని నాలుగు రోడ్ల కూడలిలో కారు దిగి ప్రజల మధ్యకు వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజలకు నమస్కరిస్తూ వారి ఆశీర్వాదం పొందారు.
#WATCH | Locals gave a rousing welcome to PM Narendra Modi, showering flower petals and raising slogans of ‘Modi, Modi’ & ‘Har Har Mahadev’ in his parliamentary constituency Varanasi
The PM is on a two-day visit to the city to inaugurate Kashi Vishwanath Corridor project pic.twitter.com/155VrYjEpT
— ANI UP (@ANINewsUP) December 13, 2021
#WATCH | People greet Prime Minister Narendra Modi in his parliamentary constituency Varanasi, Uttar Pradesh
(Source: DD) pic.twitter.com/mQkmpdSZ5Z
— ANI UP (@ANINewsUP) December 13, 2021
Also read:
Wood Smuggling: ప్రాణహిత అడ్డాగా మంచిర్యాలకు ‘మహా’ కలప.. విలువ తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం..!