“జగన్ గారి టింగ్లీస్.. this is వాస్తవం..” సీఎంపై లోకేష్ సెటైరికల్ ట్వీట్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. గతకొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలు హీటెక్కిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వైసీపీ, టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా.. వైసీపీ శ్రేణులతో పాటు.. సీఎం జగన్‌‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా లోకేశ్ ఓ ట్వీట్ చేశారు. సీఎం జగన్ ఇంగ్లీష్ ఎలా ఉంటుందో చూడండంటూ […]

జగన్ గారి టింగ్లీస్.. this is వాస్తవం.. సీఎంపై లోకేష్ సెటైరికల్ ట్వీట్

Edited By:

Updated on: Jan 27, 2020 | 2:27 PM

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. గతకొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలు హీటెక్కిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వైసీపీ, టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా.. వైసీపీ శ్రేణులతో పాటు.. సీఎం జగన్‌‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా లోకేశ్ ఓ ట్వీట్ చేశారు. సీఎం జగన్ ఇంగ్లీష్ ఎలా ఉంటుందో చూడండంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. అధ్యక్షా.. రాజధాని మార్పు కోసం ఏ బిల్లు అవసరం లేదు.. ఏ తీర్మానం అవసరం లేదంటూ ప్రసంగించారు. ఈ క్రమంలో ఆయన ఇది వాస్తవం అనే బదులుగా.. దిస్ ఈజ్ వాస్తవం అని జగన్ అన్నారు. దీనికి సంబంధించిన క్లిప్‌ను జత చేస్తూ.. లోకేష్ తన అధికారిక ట్వీట్టర్‌లో.. సీఎం జగన్ తెలుగు, ఇంగ్లీష్ భాషల్ని కలిపి వాడటంపై.. జగన్ గారి టింగ్లీష్ అంటూ.. వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us