“నాగ్” మిసైల్ ప్రయోగం సక్సెస్

సైన్యానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చడంలో డీఆర్డీఓ మరో అడుగు ముందుకేసింది. శత్రువుల యుద్ధ ట్యాంకులను ఛిన్నాభిన్నం చేసే నాగ్ మిసైల్‌ను డీఆర్డీఓ గురువారం విజయవంతంగా ప్రయోగించింది.

“నాగ్” మిసైల్ ప్రయోగం సక్సెస్

Nag missile test-fire success:  యుద్ధ ట్యాంకులను తుత్తునియలు చేసే సామర్థ్యంతో తయారు చేసిన “నాగ్” క్షిపణిని గురువారం డీఆర్డీఓ విజయవంతంగా ప్రయోగించింది. థర్డ్ జనరేషన్ “యాంటీ ట్యాంకు గైడెడ్ మిసైల్ ” (నాగ్)ను మిసైల్ క్యారియర్ “నామిక” నుంచి ప్రయోగించారు. నాగ్ క్షిపణికిది చివరి ప్రయోగం.. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో భారీ ఎత్తున ఉత్పత్తి చేసి, భారత నావికా దళానికి అప్పగించనున్నట్లు డీఆర్డీఓ ఛైర్మెన్ సతీశ్ రెడ్డి వెల్లడించారు.

అంతిమ ప్రయోగం విజయవంతం కావడంతో నాగ్ మిసైల్‌ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు డీఆర్డీఓ రెడీ అవుతోంది. డీఆర్డీఓ అందించే టెక్నాలజీతో ప్రభుత్వ రంగ సంస్థ “భారత్ డైనమిక్స్ లిమిటెడ్” ( బి.డి.ఎల్) “నాగ్” మిసైల్స్‌ను ఉత్పత్తి చేయనున్నది. మిసైల్ క్యారియర్ “నామిక”లను మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు.

పగలైనా, రాత్రి అయినా.. శత్రుసైన్యాలకు చెందిన యుధ్ద ట్యాంకులను ధ్వంసం చేసే ఈ మిసైల్స్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించామని డీఆర్డీఓ ఛైర్మెన్ సతీశ్ రెడ్డి తెలిపారు. నాగ్‌ను విజయవంతంగా ప్రయోగించిన డీఆర్డీఓను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఆయుధ తయారీలో భారత్ ఎవరి మీద ఆధారపడని స్థితికి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని సతీశ్ రెడ్డి అంటున్నారు.

Also read: పొద్దుటూరులో భారీ గోల్డ్ గోల్‌మాల్

Also read: అరెస్టును అడ్డుకుని హంగామా చేసిన మహిళలు