Mukesh Ambani: ముఖేష్ అంబానీ దాతృత్వం.. తన ఉద్యోగుల్లో ఒకరికి రూ.1500కోట్ల విలువైన బంగ్లా బహుమతి..!

|

Apr 25, 2023 | 9:58 PM

ప్రస్తుతం చాలా కంపెనీల్లో ఇంక్రిమెంట్ టైమ్ నడుస్తోంది. ఫస్ట్‌ తారీఖు కోసం రోజులు దగ్గర పడుతున్నా కొద్దీ ఉద్యోగులు జీతం పెరుగుతుందని ఎదురుచూస్తున్న తరుణం. అయితే మీ కంపెనీ యజమాని మీకు విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇస్తే ఎలా ఉంటుంది..? అలాంటి అదృష్టం ఎదురుపడినా కూడా మీరు నమ్మలేరు కదా..? ఇలాంటిది మీకు ఊహకు కూడా అందని విషయం కదా.. కానీ, ఇక్కడ నిజమైంది..

Mukesh Ambani: ముఖేష్ అంబానీ దాతృత్వం.. తన ఉద్యోగుల్లో ఒకరికి రూ.1500కోట్ల విలువైన బంగ్లా బహుమతి..!
Mukesh Ambani Gift
Follow us on

ముఖేష్‌ అంబానీ.. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు.. అంతేకాదు, అంతే విశాల హృదయం కలిగిన వ్యక్తి కూడా. తన చిరకాల ఉద్యోగి ఒకరికి ముఖేష్ అంబానీ ఇచ్చిన ఊహించని బహుమతి అందుకు నిదర్శనం. ప్రస్తుతం చాలా కంపెనీల్లో ఇంక్రిమెంట్ టైమ్ నడుస్తోంది. ఫస్ట్‌ తారీఖు కోసం రోజులు దగ్గర పడుతున్నా కొద్దీ ఉద్యోగులు జీతం పెరుగుతుందని ఎదురుచూస్తున్న తరుణం. అయితే మీ కంపెనీ యజమాని మీకు విలాసవంతమైన ఇంటిని బహుమతిగా ఇస్తే ఎలా ఉంటుంది. కానీ, ముఖేష్ అంబానీ ఇచ్చిన ఈ గిప్ట్ ఇప్పుడు సర్వత్రా ప్రశంసనీయంగా మారింది. ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తన సీనియర్ ఉద్యోగి, స్నేహితుడు మనోజ్ మోదీకి రూ.1500 కోట్ల విలువైన 22 అంతస్తుల విలాసవంతమైన భవనాన్ని బహుమతిగా ఇచ్చి దాతృత్వాన్ని ప్రదర్శించారు. పైగా ఈ ఇల్లు ముంబైలోని ప్రీమియం లొకేషన్‌లో ఉంది.

అంబానీ తీసుకున్న ఈ నిర్ణయంతో అతను ఒక పెద్ద వ్యాపారవేత్త మాత్రమే కాదు. అంతే విశాల హృదయం కలిగిన గొప్ప వ్యక్తి అని స్పష్టమైంది. మనోజ్ మోడీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎండి ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు. కంపెనీ పురోగతిలో కీలక పాత్ర పోషించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మనోజ్ మోదీని అంబానీ కుడిభుజంగా పిలుస్తారు. అలాంటి మనోజ్ మోదీకి ముకేశ్ అంబానీ బహుమతిగా ఇచ్చిన 22 అంతస్తుల భవనం ముంబైలోని ప్రీమియం లొకేషన్‌లో ఉంది. ఈ ఇల్లు ముంబైలోని నేపియన్ సముద్ర రోడ్‌లో ఉంది. తాజాగా మనోజ్ మోదీకి బహుమతిగా ఇచ్చిన ఇంటికి బృందావనం అని పేరు పెట్టారు.

Mukesh Ambani Gift To Manoj Modi

మనోజ్ మోడీ రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ డైరెక్టర్‌గా చాలా కాలంగా పనిచేస్తున్నారు. ముఖేష్ అంబానీ సన్నిహితులలో మనోజ్ మోడీ అత్యంత గుర్తింపు పొందారు. రిలయన్స్ అన్ని వ్యాపార ఒప్పందాల వెనుక మనోజ్ మోడీ ఉన్నారు. ముఖేష్ అంబానీ బహుమతిగా ఇచ్చిన ఈ భవనం 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఆ ప్రదేశంలో ధరలు చదరపు అడుగు రూ. 45,100 నుండి రూ.70,600 వరకు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటున్న మనోజ్ మోదీ ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ యాక్టివ్‌గా ఉండరు. అతను హజీరా పెట్రోకెమికల్ కాంప్లెక్స్, జామ్‌నగర్ రిఫైనరీ, టెలికాం వ్యాపారం, రిలయన్స్ రిటైల్ మొదలైన మరిన్ని ప్రాజెక్టులతో అనుబంధం కలిగి ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..