రైలు ప్రయాణంలో ఎంపీ భార్యకు చేదు అనుభవం! టీటీఈకి ఫిర్యాదు చేసినా.. జరిగింది ఇదే!

ఎంపీ తేజస్వి సూర్య భార్య శివశ్రీ స్కందప్రసాద్‌ రైలు ప్రయాణంలో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. తోటి ప్రయాణికులు గట్టిగా మాట్లాడటం, నవ్వడం వల్ల కలిగిన ఇబ్బందిని టీటీఈకి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. బహిరంగ ప్రదేశాల్లో ఇతరుల ప్రశాంతతను గౌరవించాలని, పౌర స్పృహతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆమె కోరారు. ఈ సంఘటన పట్ల సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశారు.

రైలు ప్రయాణంలో ఎంపీ భార్యకు చేదు అనుభవం! టీటీఈకి ఫిర్యాదు చేసినా.. జరిగింది ఇదే!
Mp Tejasvi Surya's Wife Shivashree

Updated on: Sep 25, 2026 | 12:31 PM

బెంగళూరు సౌత్‌ ఎంపీ తేజస్వి సూర్య భార్య, కళాకారిణి శివశ్రీ స్కందప్రసాద్‌ రైలు ప్రయాణంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఇతరుల ప్రశాంతత, వ్యక్తిగత స్థలాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. తన ప్రయాణంలో కొందరు ప్రయాణికులు ఐదు గంటల పాటు నిరంతరం గట్టిగా మాట్లాడుతూ, నవ్వుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించారని తెలిపారు.

56 సీట్లు ఉన్న కోచ్‌లో సుమారు 40 మంది మధ్య వయస్కులు ఒక బృందంగా ప్రయాణిస్తున్నారని శివశ్రీ తెలిపారు. వారు చాలా సేపు గట్టిగా మాట్లాడటంతో ప్రశాంతంగా ప్రయాణించాలనుకునే ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిందని ఆమె పేర్కొన్నారు. కళాకారులుగా తమకు నిశ్శబ్దం ఎంతో అవసరమని, ఒకేసారి అనేక ఆలోచనలు మనసులో మెదులుతుంటాయని వివరించారు.

ఈ పరిస్థితిని భరించలేక వేరే కోచ్‌లో సీటు దొరుకుతుందేమోనని టీటీఈని శివశ్రీ అడిగారు. అయితే రైలు పూర్తిగా నిండిపోవడంతో అది సాధ్యం కాలేదని తెలిపారు. దీంతో అదే కోచ్‌లో మరో సీటులో కూర్చోవాల్సి వచ్చిందన్నారు. ఇంతలో గట్టిగా మాట్లాడుతున్న ఎనిమిది మంది వ్యక్తుల బృందం యూనో ఆట ప్రారంభించిందని చెప్పారు. దీంతో మరోసారి టీటీఈని సంప్రదించగా.. ఆయన ఆ బృందాన్ని ఆట ఆపాలని సూచించారు. వారు వెంటనే ఆట నిలిపివేసినా, కొద్దిసేపటికే మళ్లీ టీటీఈతో సరదాగా మాట్లాడినట్లు శివశ్రీ తెలిపారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ బహిరంగ ప్రదేశాల్లో పౌరస్పృహ, ఇతరుల పట్ల బాధ్యతాయుతమైన ప్రవర్తన ఎప్పుడు మెరుగుపడుతుందనే ప్రశ్నను ఆమె లేవనెత్తారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రయాణించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us