Modi Letter to Rickshaw Puller: రిక్షా పుల్లర్ కూతురి పెళ్లి.. దీవెన లేఖ పంపిన మోదీ

| Edited By: Pardhasaradhi Peri

Feb 16, 2020 | 12:41 PM

వారణాసిలో మంగళ్ కేవత్ అనే రిక్షా పుల్లర్ కూతురి పెళ్లి సందర్భంగా అతని కుటుంబానికి ప్రధాని మోదీ.. దీవెనతో కూడిన లేఖను పంపారు. ఈ నెల 12 న ఈ పెళ్లి జరగగా.. నాలుగు రోజుల ముందే ఆ ఫ్యామిలీకి ఈ లేఖ అందింది. ‘ నీ కుమార్తె వివాహాన్ని పురస్కరించుకుని ఆమెకు, నీ కుటుంబానికి నా ఆశీస్సులు’ అని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధాని దత్తత తీసుకున్న డోమ్రీ గ్రామానికి చెందిన కేవత్.. తన […]

Modi Letter to Rickshaw Puller: రిక్షా పుల్లర్ కూతురి పెళ్లి.. దీవెన లేఖ పంపిన మోదీ
Follow us on

వారణాసిలో మంగళ్ కేవత్ అనే రిక్షా పుల్లర్ కూతురి పెళ్లి సందర్భంగా అతని కుటుంబానికి ప్రధాని మోదీ.. దీవెనతో కూడిన లేఖను పంపారు. ఈ నెల 12 న ఈ పెళ్లి జరగగా.. నాలుగు రోజుల ముందే ఆ ఫ్యామిలీకి ఈ లేఖ అందింది. ‘ నీ కుమార్తె వివాహాన్ని పురస్కరించుకుని ఆమెకు, నీ కుటుంబానికి నా ఆశీస్సులు’ అని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రధాని దత్తత తీసుకున్న డోమ్రీ గ్రామానికి చెందిన కేవత్.. తన కూతురి పెళ్లి శుభలేఖను స్వయంగా ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి కార్యాలయంలో అందజేశాడు. మోదీ ఈ లేఖ పంపడంతో ఆ కుటుంబ ఆనందానికి అంతేలేకపోయింది. సమాజంలో తమ లాంటివారిని కూడా మోదీ ఎంతగా పట్టించుకుంటారో ఈ లేఖ ద్వారా తెలుస్తోందని, అందుకు ఇదే నిదర్శనమని మంగళ్ కేవత్ అన్నాడు. యూపీకి త్వరలో మోదీ రానున్నారని, ఆ సందర్భంగా తమ కుటుంబ సమస్యలను ఆయనకు వివరిస్తామని కేవత్ భార్య రేణుదేవి తెలిపింది.