చైనాతో చర్చలు జరుపుతున్నాం.. రాజ్ నాథ్ సింగ్

లడఖ్ లో భారత, చైనా దేశాల మధ్య ఉద్రిక్థతల నివారణకు తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగే పరిస్థితిని..

చైనాతో చర్చలు జరుపుతున్నాం.. రాజ్ నాథ్ సింగ్

Edited By:

Updated on: May 31, 2020 | 11:48 AM

లడఖ్ లో భారత, చైనా దేశాల మధ్య ఉద్రిక్థతల నివారణకు తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భారత సార్వభౌమాధికారానికి భంగం కలిగే పరిస్థితిని ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించే ప్రసక్తే లేదని ఆయన చెప్పారు. ఉభయ దేశాల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించేందుకు సైనిక, దౌత్యపరమైన స్థాయిల్లో ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.  ఉద్రిక్తతల నివారణకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్ధుడు ట్రంప్ చేసిన ప్రకటనను ఆయన దృష్టికి తేగా.. నేను ఆ దేశ రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్ తో ఫోన్ లో మాట్లాడానని, దౌత్య, మిలిటరీ స్థాయిల్లో మా రెండు దేశాలూ చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకుంటాయని  స్పష్టం చేశానని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. ట్రంప్ ప్రతిపాదనను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పరోక్షంగా తోసిపుచ్చింది. 2017లో డోక్లామ్ వివాదాన్ని గుర్తు చేసిన రాజ్ నాథ్ సింగ్.. అప్పటి పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్న విషయం నిజమేనన్నారు. కానీ మనం వెనుకంజ వేయలేదన్నారు. మొత్తానికి పరిస్థితిని చక్కదిద్దగలిగాం అని ఆయన పేర్కొన్నారు.