ఉక్రేనియన్ విమానం కూల్చివేత ఘటన.. భగ్గుమన్న ఇరానియన్లు

| Edited By: Pardhasaradhi Peri

Jan 13, 2020 | 6:23 PM

తమ దేశ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇటీవల ఉక్రేనియాకు చెందిన విమానాన్ని కూల్చివేయడం మానవ తప్పిదమేనని ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమని, ఇందుకు విచారిస్తున్నామని, ఇరాన్ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నామని ఈ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే..  . తాము బాగ్దాద్ లోని యుఎస్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు జరుపుతుండగా ఒక క్షిపణి మిస్ ఫైర్ అయి ఆ విమానం కూలిపోయిందని కూడా ఆ తరువాత వెల్లడించింది. ఆ […]

ఉక్రేనియన్ విమానం కూల్చివేత ఘటన.. భగ్గుమన్న ఇరానియన్లు
Follow us on

తమ దేశ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఇటీవల ఉక్రేనియాకు చెందిన విమానాన్ని కూల్చివేయడం మానవ తప్పిదమేనని ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదమని, ఇందుకు విచారిస్తున్నామని, ఇరాన్ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నామని ఈ దేశ విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే..  . తాము బాగ్దాద్ లోని యుఎస్ సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు జరుపుతుండగా ఒక క్షిపణి మిస్ ఫైర్ అయి ఆ విమానం కూలిపోయిందని కూడా ఆ తరువాత వెల్లడించింది. ఆ ప్రమాదంలో పలువురు ఇరానియన్లు కూడా మరణించారు.  ఈ నేపథ్యంలో.. పరస్పర విరుధ్ధ ప్రకటనలు చేస్తున్న తమ ప్రభుత్వంపై ఇరానియన్లు మండిపడుతున్నారు. అబధ్ధాలు చెబుతోందని ఆరోపిస్తున్నారు. మూడు రోజులుగా వివిధ నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేస్తున్న ఆందోళనకారులపై పోలీసులు బాష్ప వాయువు ప్రయోగిస్తున్నారు. కాగా- . ఆదివారం టెహరాన్ యూనివర్సిటీ వద్ద వేలాది సంఖ్యలో ప్రజలు చేరుకొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.  తమ దేశ సుప్రీం కమాండర్ ఖొమైనీని దుయ్యబడుతూ.. షేమ్.. షేమ్.. లీవ్ ది కంట్రీ ‘ (దేశం వదిలి వెళ్ళిపో) అని కేకలు పెట్టారు. ఇరాన్ సినీ దర్శకుడు మాసూద్ కిమిలాయ్, సింగర్ అలీ రెజా, మహిళా ఒలంపిక్ మెడలిస్ట్ కిమియా అలీ జడే వంటి సెలబ్రిటీలు నిరసనకారులకు  మద్దతు ప్రకటించారు.  ఇరాన్ లో ఇదివరకు కొనసాగిన యుఎస్ ఎంబసీ వద్ద విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన సాగించారు. ఆ సందర్భంగా పోలీసులు కాల్పులు జరపగా ఒకరు మరణించినట్టు వార్తలు వచ్చాయి. అయితే వీటిని జనరల్ హుసేన్ రహేమీ ఖండించారు.