Watch: బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో మంటలార్పుతున్న రెస్క్యూ టీం..

బహుళ అంతస్తుల భవనంలో తెల్లవారుజామున 4:10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. భవనం బేస్‌మెంట్‌కే మంటలు పరిమితమయ్యాయని, పై అంతస్తులకు మరింత వ్యాపించకుండా మంటలను అదుపులోకి తెచ్చినట్టుగా అధికారులు తెలిపారు. అగ్నిమాపక దళంతో పాటు పోలీసు బృందాలు ప్రస్తుతం సంఘటనా స్థలంలో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

Watch: బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో మంటలార్పుతున్న రెస్క్యూ టీం..
Electronics Showroom In Mum

Updated on: Apr 29, 2025 | 9:47 AM

ముంబయిలోని బాంద్రాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ షో రూంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ముంబైలోని ఒక ఎలక్ట్రానిక్స్ షోరూమ్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. చుట్టుపక్కల దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, NDRF సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. 12 అగ్నిమాపక యంత్రాలతో మం

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

బాంద్రా వెస్ట్‌లోని లింకింగ్ రోడ్‌లోని బహుళ అంతస్తుల భవనంలో తెల్లవారుజామున 4:10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. భవనం బేస్‌మెంట్‌కే మంటలు పరిమితమయ్యాయని, పై అంతస్తులకు మరింత వ్యాపించకుండా మంటలను అదుపులోకి తెచ్చినట్టుగా అధికారులు తెలిపారు. అగ్నిమాపక దళంతో పాటు పోలీసు బృందాలు ప్రస్తుతం సంఘటనా స్థలంలో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వర్తాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..