Mask Must Even If Driving Alone: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిత్యం వేలాది సంఖ్య కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గత 24గంటల్లో 1.15 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో, ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూను సైతం అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పేరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ఆంక్షలు విధించింది.
కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లినా.. ఆ వ్యక్తి కచ్చితంగా మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని బుధవారం వెల్లడించింది. మాస్క్ అనేది సురక్షా కవచంగా పనిచేస్తుందని, కోవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రధాన కవచం అంటూ కోర్టు అభిప్రాయపడింది. అయితే.. ఒంటరిగా ప్రైవేటు కారుల్లో వెళ్తున్న వాహనదారులపై జరిమానా విధించడాన్ని రద్దు చేయాలని దాఖలైన నాలుగు పిటీషన్లను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిభా ఎం సింగ్ కొట్టేశారు. కారులో ఒక్కరు ఉన్నా.. అది పబ్లిక్ ప్లేస్.. బహిరంగ ప్రదేశమే అవుతుందంటూ ధర్మాసనం తీర్పులో వెల్లడించింది.
కారులో ఒంటరిగా ఉన్నప్పటికీ, మాస్క్ ధరించడానికి ఎందుకు అభ్యంతరం.. ఇది మీ స్వంత భద్రత కోసమే అంటూ న్యాయమూర్తి గుర్తుచేశారు. కరోనా మహమ్మారి సంక్షోభం పెరిగింది.. వ్యక్తి టీకా తీసుకున్నా.. లేకున్నా అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందేనంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి సమయంలో కూడా వైరస్ సోకే అవకాశముందని అభిప్రాయపడింది.
Also Read: