Watch Video: కొండచరియలు విరిగిపడుతుండగా రోడ్డు దాటే ప్రయత్నం.. సడెన్‌గా దూసుకొచ్చిన బండరాయి.. కట్‌చేస్తే..

ఉత్తరాఖండ్‌లో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కొండచరియలు విరిగిపడుతున్న ప్రదేశంలో ప్రమాదకర రోడ్డు దాటుతూ ఒక వ్యక్తి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రజలు వద్దని కేకలు వేస్తున్నా కూడా వినకుండా రోడ్డు దాటేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అప్పుడే సడెన్‌గా పైనుంచి ఒక బండరాయి అతని వైపునకు దూసుకొచ్చింది. కానీ అతని తృటిలో తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడయాలో వైరల్‌గా మారింది.

Watch Video: కొండచరియలు విరిగిపడుతుండగా రోడ్డు దాటే ప్రయత్నం.. సడెన్‌గా దూసుకొచ్చిన బండరాయి.. కట్‌చేస్తే..
Uttarakhand Landslide

Updated on: Aug 21, 2025 | 5:31 PM

ప్రమాదకరమైన రోడ్డు దాటుతా ఒక వ్యక్తి తృటిలో ప్రాణాలు కాపాడుకున్న ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్‌లోని చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో చాలా దగ్గర రాకపోకలు స్తంభిస్తున్నాయి. ఇదే క్రమంలో రిషికేశ్-బద్రీనాథ్ హైవేపై కొండచియలు విరిగి పడి రాకపోకలు నిలిచి పోయాయి. దీంతో రోడ్డుకు ఇరువైపుల ప్రయాణికులు నిలిచిపోయారు. ఈ సందర్భంలో ఒక యువకుడు ఆ ప్రమాదకర రోడ్డు దాటి అవతల వైపునకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ మళ్లీ కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని.. అటుగా ఎవరూ వెళ్ల వద్దని అధికారుల హెచ్చరికలు ఉన్నప్పటికీ అతను వాటిని లెక్కచేయలేదు.

స్థానిక పర్యాటకులు, వాహనదారులు వెళ్లొద్దని అరుస్తూ, ఈలలు వేస్తున్నా.. అవేవి పట్టించుకోకుండా అతను రోడ్డు దాటేందుకు ముందుకు కదలిలాడు. అయితే అతను వెళ్తున్న క్రమంలో మళ్లీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పై నుంచి ఒక పెద్ద బండరాయి అతని వైపునకు దూసుకొచ్చింది. కానీ ఆ వ్యక్తి రెప్పపాటులో దాని నుంచి తప్పించుకొని రోడ్డు అవతల వైపునకు చేరుకున్నాడు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

రోడ్డుకు ఇరువైపుల ఉన్న ఇతర పర్యాటకులు, వాహనదారులు అతను రోడ్డు దాటుతున్న దృశ్యాలను తమ ఫోన్‌లతో రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలలో భద్రతపై ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది.

మరిన్ని ట్రెండిగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.