west bengal: ఆళి చేసిన పనికి అడ్డంగా బుక్కైన మొగుడు.. పాపం జైల్లో చిప్పకూడు

|

Dec 12, 2022 | 5:54 PM

సోషల్ మీడియాలో భార్య పెట్టిన పోస్ట్ భర్తను ప్రమాదంలో పడేసింది. ఆమె పెట్టిన పోస్ట్‌కు ఫారెస్ట్‌ అధికారులు, పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆమె భర్తను అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు.

west bengal: ఆళి చేసిన పనికి అడ్డంగా బుక్కైన మొగుడు.. పాపం జైల్లో చిప్పకూడు
Wedding
Follow us on

సోషల్ మీడియాలో భార్య పెట్టిన పోస్ట్ భర్తను ప్రమాదంలో పడేసింది. ఆమె పెట్టిన పోస్ట్‌కు ఫారెస్ట్‌ అధికారులు, పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆమె భర్తను అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టారు. ఈ సంఘటన వెస్ట్‌ బెంగాల్‌లో చోటు చేసుకుంది. సిలిగురిలోని సాగతి మోర్‌లో నివాసం ఉంటున్న బాపి దత్ తన ఇంట్లోని అక్వేరియంలో అరుదైన జాతికి చెందిన రెండు తాబేళ్లను పెంచుకుంటున్నాడు. అతను చాలా రోజుల క్రితం వాటిని కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి వాటిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ వస్తున్నాడు. కానీ, ఎవరూ ఊహించని రీతిలో అవే అతనికి కష్టాలు తెచ్చిపెట్టాయి. అయితే సోషల్‌మీడియాలో అతని భార్య పెట్టిన పోస్ట్‌ అతడిని చిక్కుల్లో పడేలా చేసింది. బాపిదత్ భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే అది అటవీ శాఖ దృష్టికి వచ్చింది.

బాపిదత్‌ భార్య మితా దత్తా సోషల్ మీడియాలో ఇటీవల కొన్ని ఫోటోలు, వీడియోలను షేర్‌ చేశారు. అందులో తన భర్త తాబేళ్లను కొనుగోలు చేసిన ఫోటోలను, అక్వేరియంలో అవి హాయిగా ఆడుకుంటున్న చిత్రాలు కనిపించాయి. ఇవన్నీ మితా దత్తా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇక అంతే, ఈ విషయం బెలకోబా రేంజ్ ఆఫీసర్ సంజయ్ దత్ దృష్టికి వచ్చింది. బైకుంత్‌పూర్ అటవీ డివిజన్‌లోని బెలకోబా పరిధి అటవీ సిబ్బంది బాపి దత్‌ నివాసంలో సోదాలు నిర్వహించారు. రెండు తాబేళ్లతో పాటు ఒక పక్షిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే బాపి దత్‌ని అరెస్టు చేశారు.

అటవీశాఖ సిబ్బంది ఇంటికి వెళ్లగా.. ఇంట్లో అలాంటి జంతువు లేదని బాపి తెలిపారు. ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించగా అక్వేరియంలో రెండు తాబేళ్లు, ఒక పక్షి కనిపించాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయగా.. ఆ రెండు తాబేళ్లు అరుదైన భారతీయ డేరా తాబేళ్లని గుర్తించారు. ఈ రకం తాబేళ్లు పెంపుడు జంతువులు కాదు. అమ్మడం లేదా వేటాడడం నిషేధించబడింది. చట్టాన్ని ఉల్లంఘిస్తే కనీసం ఏడేళ్ల వరకు నాన్ బెయిలబుల్ జైలు శిక్ష విధించబడుతుంది. విషయం తెలిసిన వెంటనే అటవీ సిబ్బంది దాడులు చేశారు.

ఇవి కూడా చదవండి

Turtle Rescued

ఆ తర్వాత బాపి దత్‌ను అటవీ శాఖ అరెస్టు చేసింది. అతను చెప్పినప్పటికీ, తాబేలును పెట్టుకోవడం నిషేధించబడుతుందని అతనికి తెలియదు. నిందితుడిని జల్పాయ్ గురి కోర్టులో హాజరుపరిచారు. అటవీ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, దర్యాప్తు అధికారులు బాపిపై వైల్డ్ లైఫ్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి