ఒరేయ్‌ అజామూ అగెత్తరో.. సడెన్‌గా ఎదురు పడిన మనిషి, సింహం.. తర్వాత ఏం జరిగిందో చూడండి!

సాధారణంగా ఒక మనిషి, సింహం ఎదురు పడితే ఏం జరుగుతుంది. ఆ మనిషికి సింహం చంపేసి తినేయడమో, లేదో దాడి చేయడమో చేస్తుంది. కానీ ఇక్కడ జరిగిన ఒక ఘటన ఇందుకు బిన్నంగా ఉంది. ఒక సింహం, మనిషి సడెన్‌గా ఎదురుపడినప్పుడు, ఆ వ్యక్తితో పాటు సింహం కూడా బయటపడిపోయింది. దాన్ని చూసిన భయానికి అతనికి పరుగులు పెట్టగా, సింహం కూడా అతన్ని చూసి అక్కడి నుంచి పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఒరేయ్‌ అజామూ అగెత్తరో.. సడెన్‌గా ఎదురు పడిన మనిషి, సింహం.. తర్వాత ఏం జరిగిందో చూడండి!
Viral Video

Updated on: Aug 10, 2025 | 9:20 PM

సాధారణంగా ఒక మనిషి, సింహం ఎదురు పడితే ఏం జరుగుతుంది. ఆ మనిషికి సింహం చంపేసి తినేయడమో, లేదో దాడి చేయడమో చేస్తుంది. కానీ ఇక్కడ జరిగిన ఒక ఘటన ఇందుకు బిన్నంగా ఉంది. ఒక సింహం, మనిషి సడెన్‌గా ఎదురుపడినప్పుడు, ఆ వ్యక్తితో పాటు సింహం కూడా బయటపడిపోయింది. దాన్ని చూసిన భయానికి అతనికి పరుగులు పెట్టగా, సింహం కూడా అతన్ని చూసి అక్కడి నుంచి పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన గుజరాత్‌లోని జునాగడ్‌లో వెలుగు చూసింది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. జునాగడ్‌ సిటీకి సమీపంలో ఒక సిమెంట్‌ ఫ్యాక్టరీ ఉంది. అయితే అక్కడ పనిచేసే ఒక వ్యక్తి కాసేపు బయట తిరుగుదామని ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చాడు. కాంపౌండ్‌ నుంచి బయటకు వెళ్తుండగా.. ఆ ఫ్యాక్టమీ వైపు ఒక ఆడ సింహం రావడం గమనించాడు. ఆ సింహం కూడా అతన్ని చూసింది. అయితే ఒక్కసారిగా సింహాన్ని చూసి ఆ వ్యక్తితో పాటు, సింహం కూడా అతన్ని చూసి భయపడింది. దీంతో ఆ వ్యక్తి  ఫ్యాక్టరీలోకి పరుగులు తీయగా.. ఇ సింహాం కూడా అక్కడి నుంచి వెనక్కి పరిగెత్తింది. ఈ ఘటన ఆగస్ట్‌ 6న వెలుగు చూసింది.

అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు మొత్తం ఫ్యాక్టరీ ఆవరణలో ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు చూడడం చాలా అదరుదని ఒకరు కామెంట్‌ చేయగా.. ఆ వ్యక్తికన్నా సింహమే ఎక్కువ భయపడిందని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.