‘మోదీజీ ! ఆ రెండు చట్టాలపై మళ్ళీ ఆలోచించండి’… దీదీ

| Edited By: Ravi Kiran

Jan 11, 2020 | 6:32 PM

దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన ఎన్నార్సీ , సీఏఏలపై మరోసారి ఆలోచించాలని ప్రధాని మోదీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. శనివారం కోల్‌కతా చేరుకున్న ఆయనను దీదీ.. రాజ్‌భవన్‌లో కలిసి ఈ మేరకు అభ్యర్థించారు. (రెండు రోజుల పర్యటనకు గాను మోదీ ఈ నగరానికి చేరుకున్నారు). ఎన్నార్సీ , సీఏఏలపై బీజేపీ, మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మధ్య చిచ్ఛు రేగిన సంగతి విదితమే. మోదీతో  తాను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాయని, ఈ రాష్ట్ర ప్రజలు ఈ […]

మోదీజీ ! ఆ రెండు చట్టాలపై మళ్ళీ ఆలోచించండి... దీదీ
Follow us on

దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన ఎన్నార్సీ , సీఏఏలపై మరోసారి ఆలోచించాలని ప్రధాని మోదీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. శనివారం కోల్‌కతా చేరుకున్న ఆయనను దీదీ.. రాజ్‌భవన్‌లో కలిసి ఈ మేరకు అభ్యర్థించారు. (రెండు రోజుల పర్యటనకు గాను మోదీ ఈ నగరానికి చేరుకున్నారు). ఎన్నార్సీ , సీఏఏలపై బీజేపీ, మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మధ్య చిచ్ఛు రేగిన సంగతి విదితమే.

మోదీతో  తాను మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాయని, ఈ రాష్ట్ర ప్రజలు ఈ చట్టాలను అంగీకరించడం లేదన్న విషయాన్ని స్పష్టం చేశానని ఆ తరువాత ఆమె చెప్పారు. వీటిపై పునరాలోచించాలని కోరానన్నారు. అయితే తను ఈ నగరానికి ఇతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చానని, ఢిల్లీకి వచ్చి ఈ విధమైన సమస్యలపై చర్చించాలని మోదీ కోరారని ఆమె వెల్లడించారు. ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా వెస్ట్ బెంగాల్‌లో భారీ నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. వీటిలో సీఎం మమతా బెనర్జీ స్వయంగా పాల్గొన్నారు. కాగా- కోల్‌కతాలో జరిగే కార్యక్రమాల్లో రెండింటిలో ప్రధాని మోదీతో బాటు దీదీ కూడా పార్టిసిపేట్ చేయనున్నారు.