మీరు కొత్తగా కారు కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ వార్త. ప్రముఖ మహీంద్రా ఆటోమొబైల్ సంస్థ కొత్తగా కారు కొనాలనుకునే వారికి శుభవార్త అందించింది. పలు కార్ల కొనుగోలుపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. దీంతో ప్రతి వినియోగదారుడు కారు కొనుదారులకు రూ.3.06 లక్షల వరకు ప్రయోజనం చేకూరనున్నట్లుగా ఈ సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ ఇటీవల విడుదలైన థార్ మినహా కంపెనీకి చెందిన అన్ని మోడళ్ళపై వర్తించనున్నట్లుగా ప్రకటించింది. ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంటుందని.. కాగా ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్, రాయితీలలో ఈ ప్రయోజనాలను కస్టమర్లకు అందించనున్నట్లుగా మహీంద్రా సంస్థ తెలిపింది.
అటు ప్లాగ్షిప్ ఎస్యూవీ బీఎస్6 ఆల్టూరస్ జీ4పై ఎక్కువగా రూ.3.06 లక్షల వరకు ప్రయోజానాలను కల్పించనుంది. ఈ కారు కొనేవారు రూ.2.20 లక్షల వరకు డిస్కౌంట్తో పాటు రూ.50.000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.16,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ.20,000 వరకు పలు రకాలుగా ప్రయోజనాలను కల్పించనున్నట్లుగా తెలిపింది. ఇక మిగతా వాహనాలైన మహీంద్రా కేయూవీ 100 ఎన్ఎక్స్టీపై రూ.62,055, స్కార్పియోపై రూ.30,600, బోలెరోపై రూ.20,550 వరకు డిస్కౌంట్లు కల్పించనుంది. కాగా సంవత్సరం ముగుస్తుండడంతో పలు ఆటోమొబైల్ సంస్థలు ఇయర్ ఎండ్ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి.