Pune, July 27: పూణెలో దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు చెల్లించలేదని, అతని భార్యపై అత్యాచారం చేశాడు ఓ వడ్డీ వ్యాపారీ. ఫిబ్రవరి నెలలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు వెలుగు చూడటం పూణెలో సంచలనం రేపుతోంది. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని పూణె నగరానికి చెందిన ఓ వడ్డీ వ్యాపారీ(47) వద్ద అదే ప్రాంతానికి చెందిన వ్యక్తి వడ్డీకి రుణం తీసుకున్నాడు. అయితే, తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో జాప్యం చేయడంతో ఆ వడ్డీ వ్యాపారి రెచ్చిపోయాడు. సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి అతనితో ఘర్షణకు దిగాడు. అక్కడే ఉన్న అతని భార్యను చూసిన వ్యాపారి.. తన పైశాచికాన్ని బయటపెట్టుకున్నాడు. డబ్బు తీసుకున్న వ్యక్తి మెడపై కత్తి పెట్టి.. అతని భార్యపై అత్యాచారం చేశాడు. తన అనుచరులతో కలిసి ఈ దురాఘాతానికి పాల్పడ్డాడు నిందితుడు. అయితే, ఈ దారుణాన్ని తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించిన నిందితులు.. బయట చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే, ఇటీవల నిందితులు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంలో మ్యాటర్ రివీల్ అయ్యింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..