Mumbai Rains: మహారాష్ట్రలో కుండపోత వర్షాలు.. ముంబై, పుణెలో రెడ్ అలెర్ట్..! షాకింగ్ వీడియోలు

|

Jul 25, 2024 | 6:49 PM

మహారాష్ట్ర భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. గూడు చెదిరి కొందరు.. గుండె పగిలి మరికొందరు. బతుకుజీవుడా అంటూ.. ప్రాణాలరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో చెట్టుకు, పుట్టకు చేరిన దైన్యం...! ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిందంతా ఊడ్చిపెట్టుకుపోయింది. కట్టుబట్టలు మినహా ఏమీ మిగల్చలేదు. నిండు జీవితాలను చిదిమేస్తూ.... వరద బీభత్సం సృష్టించింది.

Mumbai Rains: మహారాష్ట్రలో కుండపోత వర్షాలు.. ముంబై, పుణెలో రెడ్ అలెర్ట్..! షాకింగ్ వీడియోలు
Maharashtra Rains
Follow us on

మహారాష్ట్ర భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. గూడు చెదిరి కొందరు.. గుండె పగిలి మరికొందరు. బతుకుజీవుడా అంటూ.. ప్రాణాలరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో చెట్టుకు, పుట్టకు చేరిన దైన్యం…! ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిందంతా ఊడ్చిపెట్టుకుపోయింది. కట్టుబట్టలు మినహా ఏమీ మిగల్చలేదు. నిండు జీవితాలను చిదిమేస్తూ…. వరద బీభత్సం సృష్టించింది. ముంబై, పుణె నగరాల్లో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల నేపథ్యంలో విద్యా సంస్థలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. మహారాష్ట్రలోని నాలుగు ప్రధాన నదుల్లో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వచ్చే 24 గంటలకు భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ కేంద్రం(IMD) హెచ్చరించింది. ముంబై, పుణె, రాయ్‌గఢ్‌కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

ముంబైలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. పలు విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. ఈనేపథ్యంలో విమానయాన సంస్థలు ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. వర్షం కారణంగా విమాన సమయాల్లో జాప్యానికి కారణమవుతోందని, విమానాశ్రయాలకు బయల్దేరేముందు ఫ్లైట్‌ స్టేటస్ తనిఖీ చేసుకోవాలని ఇండిగో సంస్థ సూచించింది. స్పైస్‌జెట్ నుంచి కూడా ఇదేతరహా ప్రకటన వచ్చింది. అటు లోకల్ రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి.

ముంబై నగరానికి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

ముంబైలో భారీ వర్షం దృశ్యాలు..

భారీ వర్షాల నేపథ్యంలో ముంబైలో కనిపించిన దృశ్యం..

అటు పుణెలో భారీ వర్షాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజా రవాణా సేవలకు అంతరాయం ఏర్పడి… అనేక చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు కొల్హాపూర్‌లోని పలు ప్రాంతాలు జలదిగ్బంధం ఏర్పడి జనజీవనం స్తంభించింది. పాఠశాలలు మూసివేయబడ్డాయి. వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో వివిధ ఘటనల్లో నలుగురు దుర్మరణం చెందారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి.

పుణె లోని నింబజ్నినగర్‌లో వరదలో చిక్కుకున్న 70 మందిని ఫైర్‌ సిబ్బంది కాపాడారు. అపార్ట్‌మెంట్ల లోకి వరదనీరు ప్రవేశించడంతో జనం ప్రాణభయంతో వణికిపోయారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు 70 మందిని రక్షించారు.

భివాండి నగరంలో భారీ వర్షాలు

అటు యూపీ రాజధాని లక్నోలో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. ఏ గల్లీ చూసినా చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.

జార్ఖండ్ రాజధాని రాంచీలోనూ వాగువంకలు ఉధృతంగా ప్రవహించడంతో పలుప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఇళ్ల లోకి వరదనీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లన్నీ నదుల్లా మారిపోయాయి. భారీ వరద కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.