Corona Update: రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 63,282 పాజిటివ్‌ కేసులు..

Corona Update: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే కరోనా కేసులకు,..

Corona Update: రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో 63,282 పాజిటివ్‌ కేసులు..
ప్రతీకాత్మక చిత్రం

Updated on: May 01, 2021 | 9:22 PM

Corona Update: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. ఇక మహారాష్ట్రలో అయితే కరోనా కేసులకు, మరణాలకు అంతే లేకుండా పోతోంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 63,282 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 802 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 46,65,754కు చేరగా, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 69,615కు పెరిగింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో 61,326 మంది క‌రోనా రోగులు కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 39,30,302కు చేరిన‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,63,758 యాక్టివ్ క‌రోనా కేసులు ఉన్నాయి. ఇక దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర తొలి స్థానంలో కొన‌సాగుతోంది.

ఇక దేశ దేశవ్యాప్తంగా రోజురోజుకూ కేసులు, మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దేశంలో 24 గంటల్లో దేశంలో 4,01,993 కేసులు నమోదు కాగా,3,523 మంది మరణించారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,91,64,969 (1.91 కోట్లు) కు పెరగగా.. మరణాల సంఖ్య 2,11,853 కి పెరిగింది.

ఇవీ కూడా చదవండి:

AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ.. గడిచిన 24 గంటల్లో 19,412 పాజిటివ్‌ కేసులు నమోదు

కరోనాపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ అధికారులకు కీలక ఆదేశాలు.. పర్యవేక్షణకు సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి నియామకం

Indian Covid-19 Variant: భారత్‌లో కొత్త వేరియంట్లతో కరోనా విజృంభణ.. ఈ వేరియంట్ ఎక్కడెక్కడ వ్యాపించిందంటే?

 

Loading...
Unable to load recommendations.
Follow Us