ఆలయాలను తెరవాలంటూ మహారాష్ట్రలో వినూత్న నిరసన

మహారాష్ట్రలో ఇప్పటికీ మూసి ఉన్న ఆలయాలను, ప్రార్థనామందిరాలను తెరవాలంటూ బీజేపీ ఆధ్వర్యాన పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు, భక్తులు వినూత్న నిరసన చేపట్టారు.  ముంబై లోని ప్రధాన వీధుల్లో..

ఆలయాలను తెరవాలంటూ మహారాష్ట్రలో వినూత్న నిరసన

Edited By:

Updated on: Aug 30, 2020 | 11:51 AM

మహారాష్ట్రలో ఇప్పటికీ మూసి ఉన్న ఆలయాలను, ప్రార్థనామందిరాలను తెరవాలంటూ బీజేపీ ఆధ్వర్యాన పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు, భక్తులు వినూత్న నిరసన చేపట్టారు.  ముంబై లోని ప్రధాన వీధుల్లో వారు గంటలు కొడుతూ వింత ప్రొటెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత పాటిల్.. రాష్ట్రంలో లిక్కర్ షాపులను, ఇతర వ్యాపార సముదాయాలను మళ్ళీ ప్రారంభిస్తున్నారని, అలాంటప్పుడు ఆలయాలు, ప్రార్థనా మందిరాలను మాత్రం ఎందుకు తిరిగి తెరవడంలేదని ప్రశ్నించారు. ఇది భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తోందన్నారు. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా..ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో గుడులను తెరవాలని డిమాండ్ చేశారు. మానసిక ప్రశాంతతకు ఆలయాలు దోహదం చేస్తాయన్నారు.

ఎలాగూ అన్ లాక్ 4.0 దశని సెప్టెంబరు 1 నుంచి అమలు చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ముంబైతో బాటు రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో కూడా బీజేపీ నేతలు, కార్యకర్తలు  ఈ విధమైన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారని చంద్రకాంత పాటిల్ చెప్పారు.

Loading...
Unable to load recommendations.
Follow Us