మహారాష్ట్ర లోని పాలక మహా వికాస్ అఘాడీలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోల్ కొత్త వివాదం రేపారు. సోమవారం అకోలాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని అన్నారు. పైగా సీఎం అభ్యర్థిని తానే అని ప్రకటించుకున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ…ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పారు. ‘నన్ను సీఎం అభ్యర్థిగా చూడాలని మీరు అనుకోవడం లేదూ అని ప్రశ్నించారు. ఆ ఎన్నికల్లో మా పార్టీ విజయం ఖాయమన్నారు. అయితే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ వ్యాఖ్యలను తేలిగ్గా కొట్టిపారేశారు. ఎవరైనా కలలు కనవచ్చునని…తుది నిర్ణయం మాత్రం పొత్తు ఉంటుందా లేక ఒంటరిగా పోటీ చేయాలా అన్న విషయాన్ని సోనియా గాంధీ గానీ, శరద్ పవార్ గానీ, సీఎం ఉద్ధవ్ థాక్రే గానీ తీసుకుంటారని ఆయన చెప్పారు. ఇలా ఉండగా రాష్ట్రంలో ఉద్ధవ్ ప్రభుత్వం తన పదవీ కాలాన్ని అర్ధ కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలు రకాల ఊహాగానాలు తలెత్తాయి. రాష్ట్ర నాయకత్వం మారవచ్చునని కొందరు అభిప్రాయపడ్డారు. సీఎం మార్పు ఉండవచ్చునని వారు సందేహాలను లేవనెత్తారు.
శివసేన ఈ ఊహాగానాలను తిరస్కరించినప్పటికీ.. ముఖ్యంగా ఉద్ధవ్ థాక్రే ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయినప్పటి నుంచి ఇవి బలం పుంజుకున్నాయి. సేన ఎంపీ సంజయ్ రౌత్ ఒక రోజు ప్రధానిని బీజేపీని పొగుడుతూ మరో రోజున బీజేపీని విమర్శించడం చూస్తే నేతల్లో అయోమయం నెలకొన్నట్టు కనిపిస్తోందని భావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: జోరు పెంచిన చిన్నారి పెళ్లికూతురు.. తెలుగులో వరుస సినిమాలతో బిజీ గా అవికా గోర్ ..: Avika Gor Video
సంచయితకు హైకోర్టు షాక్ ..అశోక్ గజపతిరాజును పునర్నియమించాలని ఆదేశం:MANSAS Trust Live Video.