‘ మహా ‘ ఎపిసోడ్.. ప్రొటెమ్ స్పీకర్ ఎన్నిక..’ సుప్రీం ‘ కెక్కే యోచనలో బీజేపీ

|

Nov 30, 2019 | 2:12 PM

మహారాష్ట్రలో కొత్త సీఎం, శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోబోతున్న సమయంలో ప్రొటెమ్ స్పీకర్ ఎంపిక వివాదాస్పదమైంది. ఎన్సీపీకి చెందిన దిలీప్ వాల్సే పాటిల్ ని సేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే వారు తమ పార్టీకి చెందిన కాళిదాస్ కొలంబకర్ స్థానే పాటిల్ ని నియమించడమేమిటని బీజేపీ ప్రశ్నిస్తోంది. (సభలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాన్ని ఆయన పర్యవేక్షించారు.. వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు). కాగా- వాల్సే నియామకం చట్టబధ్ధంగా […]

 మహా  ఎపిసోడ్.. ప్రొటెమ్ స్పీకర్ ఎన్నిక.. సుప్రీం  కెక్కే యోచనలో బీజేపీ
Follow us on

మహారాష్ట్రలో కొత్త సీఎం, శివసేన అధినేత ఉధ్ధవ్ థాక్రే అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోబోతున్న సమయంలో ప్రొటెమ్ స్పీకర్ ఎంపిక వివాదాస్పదమైంది. ఎన్సీపీకి చెందిన దిలీప్ వాల్సే పాటిల్ ని సేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే వారు తమ పార్టీకి చెందిన కాళిదాస్ కొలంబకర్ స్థానే పాటిల్ ని నియమించడమేమిటని బీజేపీ ప్రశ్నిస్తోంది. (సభలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాన్ని ఆయన పర్యవేక్షించారు.. వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు). కాగా- వాల్సే నియామకం చట్టబధ్ధంగా చెల్లదని రాష్ట్ర బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ దుయ్యబట్టారు.

పైగా దిలీప్ వాల్సే పాటిల్ ప్రమాణం కూడా నిబంధనల ప్రకారం జరగలేదని, కొత్త ప్రభుత్వం అన్ని రూల్స్ ని అతిక్రమిస్తోందని ఆయన ఆరోపించారు. దీనిపై తాము గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని, సుప్రీంకోర్టుకు కూడా ఎక్కే యోచనలో ఉన్నామని ఆయన తెలిపారు. సాధారణంగా సంప్రదాయం ప్రకారం… అసెంబ్లీలో అత్యంత సీనియర్ అయిన ఎమ్మెల్యేని ప్రొటెమ్ స్పీకర్ గా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ ప్రకరాం చూస్తే.. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలాసాహెబ్ థోరత్ అత్యంత సీనియర్ సభ్యుడు. అయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఈ సంప్రదాయానికి ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన కూటమి చెల్లుచీటీ పాడినట్లు కనిపిస్తోంది.