అందంగా ఉందని పెళ్లి చేసుకున్న యువకుడు.. 25 రోజులకు బయటపడ్డ వధువు అసలు రూపం..!

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ని షాజాపూర్ జిల్లాలో సంచలనం రేపిన ఓ వివాహ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరిగిన 25 రోజుల తర్వాత తమ కోడలు ట్రాన్స్‌జెండర్ అని తెలిసిందంటూ వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.

అందంగా ఉందని పెళ్లి చేసుకున్న యువకుడు.. 25 రోజులకు బయటపడ్డ వధువు అసలు రూపం..!
Marriage Fraud

Updated on: Jul 29, 2026 | 9:07 AM

మధ్యప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ని షాజాపూర్ జిల్లాలో సంచలనం రేపిన ఓ వివాహ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి జరిగిన 25 రోజుల తర్వాత తమ కోడలు ట్రాన్స్‌జెండర్ అని తెలిసిందంటూ వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, షాజాపూర్‌కు చెందిన ఓ యువకుడు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వివాహం ఆలస్యం కావడంతో, పరిచయస్తుల ద్వారా రాజ్‌గఢ్ జిల్లా పచోర్‌కు చెందిన కుటుంబంతో సంబంధం కుదిరింది. జూన్ 29న స్థానిక ఆలయంలో ఘనంగా వివాహం జరిగింది. పెళ్లి ఏర్పాట్లు, ఇతర ఖర్చుల కోసం సుమారు రూ. 5 లక్షలు, అదనంగా రూ. 1 లక్ష నగదు ఖర్చు చేసినట్లు వరుడి కుటుంబం ఆరోపిస్తోంది.

వివాహం అనంతరం జూన్ 30న వధువు అత్తగారింటికి చేరుకుంది. అయితే మొదటి రాత్రే తనకు నెలసరి వచ్చిందని చెప్పిందని, అనంతరం ఆరోగ్యం బాగోలేదని చెబుతూ జూలై 2న పుట్టింటికి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు మూడు వారాల తర్వాత జూలై 23న తిరిగి అత్తగారింటికి వచ్చిన ఆమె ప్రవర్తనపై కుటుంబ సభ్యులకు అనుమానం కలిగింది. ముఖానికి షేవింగ్ క్రీమ్ పూసుకోవడం, ఇతర ప్రవర్తనలో తేడాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, ఆమె ట్రాన్స్‌జెండర్ అని తెలుసుకున్నట్లు వారు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తాము పథకం ప్రకారం మోసపోయామని ఆరోపిస్తూ షాజాపూర్ కోత్వాలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు వధువు తండ్రిగా పేర్కొన్న లక్ష్మీనారాయణ్‌తో పాటు ఆజాద్, రాకేష్, రాజా, చంద్రోబాయిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది వ్యవస్థీకృత వివాహ మోసాల ముఠా పనా? లేక వ్యక్తిగత మోసమా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. అయితే ట్రాన్స్‌జెండర్ వ్యక్తి కావడం నేరం కాదని, ఈ కేసులో దర్యాప్తు వివాహ సమయంలో గుర్తింపును ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టి మోసం జరిగిందనే అంశంపైనే కేంద్రీకృతమై ఉందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us