LPG Crisis Live Updates: గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు..

US Israel Iran war effect on LPG Gas Cylinder : ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు నెలకొన్నాయి.. దేశవ్యాప్తంగా చాలా నగరాలు, పట్టణాల్లో వంటగ్యాస్‌ సిలిండర్లు రోడ్లమీదకు వచ్చాయి. ఖాళీ గ్యాస్‌ బండలు క్యూ కట్టాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యాస్‌ కొరత అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. కేవలం, గ్యాస్‌పైనే ఆధారపడిన రంగాల కష్టాలైతే మరింత దుర్భరంగా మారుతున్నాయి.

LPG Crisis Live Updates: గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు..
Lpg Gas Cylinder Shortage

Updated on: Mar 15, 2026 | 2:18 PM

US Israel Iran war effect on LPG Gas Cylinder : ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు నెలకొన్నాయి.. దేశవ్యాప్తంగా చాలా నగరాలు, పట్టణాల్లో వంటగ్యాస్‌ సిలిండర్లు రోడ్లమీదకు వచ్చాయి. ఖాళీ గ్యాస్‌ బండలు క్యూ కట్టాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా గ్యాస్‌ కొరత అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. కేవలం, గ్యాస్‌పైనే ఆధారపడిన రంగాల కష్టాలైతే మరింత దుర్భరంగా మారుతున్నాయి. ముఖ్యంగా.. కమర్షియల్ గ్యాస్ ఉపయోగించే హోటళ్లు-రెస్టారెంట్లు, LPG, CNG ఆటోవాలాల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. గ్యాస్ కష్టాలు లేవని, అందరికీ గ్యాస్ అందుతుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తున్నా.. చాలా మంది.. ఖాళీ బండలతో రోడ్లెక్కుతున్నారు. హర్మూజ్‌ జలసంధిలోని భారత్‌కు చెందిన LPG నౌకలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే.. ఓ నౌక భారత్‌కు చేరుకోగా.. ఇప్పుడు మరో రెండు LPG నౌకలు కూడా ఒకట్రెండు రోజుల్లో గుజరాత్‌కు రాబోతున్నట్లు వెల్లడించింది. హర్మూజ్‌ జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా.. ఈ మార్గంలో భారత నౌకలు వెళ్లేందుకు అనుమతిస్తామని ఇటీవల ఇరాన్‌ ప్రకటించింది. దీనికి తగ్గట్లే.. రెండు భారత జెండాలు ఉన్న ఎల్పీజీ నౌకలు నిన్న ఉదయం సురక్షితంగా హర్మూజ్‌ జలసంధిని దాటాయని కేంద్రం తెలిపింది. ‘శివాలిక్‌’, ‘నందాదేవి’ పేరు గల నౌకలు గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా పోర్టుల వైపు వస్తున్నాయని షిప్పింగ్‌ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ నౌకల్లో సుమారు 92 వేల టన్నుల ఎల్పీజీ ఉందని, రెండు రోజుల్లో భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని చెప్పింది. దేశంలో ఎల్పీజీ సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోన్న సమయంలో తాజా పరిణామం ఊరట కలిగిస్తోంది.

ఆందోళన వద్దు..

మరోవైపు.. గృహ వినియోగ సిలిండర్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. అయితే.. అవసరం లేకున్నా చాలామంది బుకింగ్‌ చేయడంతోనే ఆందోళన వ్యక్తమవుతోంది. బ్లాక్‌మార్కెట్‌ను అరికట్టాలని రాష్ట్రాలను కోరడంతో పాటు.. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొంది. గల్ఫ్‌లో ఉన్న భారతీయ నౌకలు క్షేమంగానే ఉన్నాయని, వాటిలో ఉన్న భారత సిబ్బందికి ఎలాంటి సమస్యలు లేవని కేంద్రం పేర్కొంది. హర్మూజ్‌ జలసంధిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపింది. భారత నావికుల కుటుంబసభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని వెల్లడించింది

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Mar 2026 01:25 PM (IST)

    భారత్‌కు ట్రంప్ మద్దతు

    శనివారం తెల్లవారుజామున వివాదాస్పద హార్ముజ్ జలసంధి గుండా భారతదేశ జెండాతో రెండు ట్యాంకర్లు ప్రయాణించాయి. ఈ కీలకమైన జలసంధి గుండా రాకపోకలు సాగించడానికి అమెరికా నావికాదళ మద్దతు ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. భారత్‌కు మద్దతుగా ఉంటామని తెలిపారు.

  • 15 Mar 2026 12:19 PM (IST)

    వాణిజ్య సిలిండర్ల పంపిణీ ప్రారంభం

    హర్ముజ్ జలసంధి ద్వారా సముద్ర రాకపోకలు ప్రారంభం కావడంతదో LPG సిలిండర్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మార్చి 14న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోవాణిజ్య LPG సిలిండర్ల పంపిణీని ప్రారంభించింది. విస్తృత చర్చల తర్వాత వాణిజ్య వినియోగదారులకు కూడా LPG లభిస్తుందని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రాష్ట్రాల్లో వాణిజ్య సిలిండర్ల పంపిణీ ప్రారంభించింది. వినియోగదారులు వాటిని స్వీకరించడం ప్రారంభించారు.

  • 15 Mar 2026 11:37 AM (IST)

    గల్ప్ నుంచి ఇండియాకు రెండు ట్యాంకర్లు

    LPG కొరత నేపథ్యంలో గల్ఫ్ నుండి రెండు LPG ట్యాంకర్లు మార్చి 16-17 మధ్య భారతదేశానికి చేరుకుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్యాంకర్ శివాలిక్ మార్చి 16న ముంద్రా ఓడరేవుకు చేరుకునే అవకాశం ఉంది. ఇక నందా దేవి ఒక రోజు తర్వాత చేరుకునే అవకాశం ఉందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు.

  • 15 Mar 2026 10:58 AM (IST)

    గ్యాస్ కొరత.. విద్యుత్ బిల్లుపై సబ్సిడీ

    ఎల్పీజీ సంక్షోభం క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ స్టవ్‌లను ఉపయోగించే హోటళ్లు, స్టాల్స్‌కు విద్యుత్ బిల్లుపై యూనిట్‌కు రూ.2 సబ్సిడీని అందిస్తోంది. హోటళ్ళు, టీ స్టాళ్ళు, క్లౌడ్ కిచెన్లు LPG సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టవ్‌లకు మారాలని సూచించింది. ఇలా మారితే విద్యుత్ బిల్లులపై యూనిట్‌కు రూ.2 సబ్సిడీ ఇస్తామంటూ ప్రకటించింది. LPG కొరత కొనసాగుతున్నంత కాలం సబ్సిడీ అమలులో ఉంటుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు.

  • 15 Mar 2026 10:25 AM (IST)

    కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు ప్రాధాన్యత

    ప్రజలు  భయాందోళనకు గురై అవసరం లేకపోయినా సిలిండర్లను బుక్ చేసుకోవద్దని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రతినిధి సుజాత శర్మ సూచించారు.  ఒక రోజులోనే బుకింగ్‌ల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆమె స్పందించారు. భయాందోళనలకు గురై బుకింగ్‌లు చేసుకోవద్దని, దయచేసి అవసరమైనప్పుడు మాత్రమే బుక్ చేసుకోండి అంటూ సూచించారు. వాణిజ్య సిలిండర్లకు కూడా కొంత పరిమాణంలో LPGని కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా చర్చలు జరిగాయని, తత్ఫలితంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు ప్రాధాన్యత ఇవ్వడానికి నిర్ణయించామన్నారు. 

  • 15 Mar 2026 09:55 AM (IST)

    PNG నిరంతర సరఫరా

    PNG నిరంతరాయంగా సరఫరా చేస్తామని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ తెలిపింది. ఎల్‌పిజి సిలిండర్ల సరఫరాలో కొరత భయం మధ్య ఆసుపత్రులు, ఇతర ముఖ్యమైన సేవలకు పైప్‌లైన్ సహజ వాయువు (పిఎన్‌జి) సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ధృవీకరించింది. కీలకమైన సంస్థలకు క్రమం తప్పకుండా మరియు నమ్మదగిన గ్యాస్ సరఫరాను నిర్ధారించడానికి IGL అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.

  • 15 Mar 2026 08:44 AM (IST)

    LPG సిలిండర్ల సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌

    LPG సిలిండర్ల సరఫరాలో ఇబ్బందులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. సచివాలయంలో ఇవాళ మంత్రి ఉత్తమ్‌తో LPG డిస్ట్రిబ్యూషర్ల సంఘం భేటీ అయింది. క్షేత్రస్థాయిలో తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను మంత్రి ఉత్తమ్‌కు డిస్ట్రిబ్యూటర్లు వివరించనున్నారు. సోషల్‌ మీడియా ప్రచారాలతో గందరగోళం ఏర్పడిందని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. LPG కొరతపై నిన్న జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష నిర్వహించారు. కృత్రిమ కొరత సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

  • 15 Mar 2026 08:16 AM (IST)

    గ్యాస్ కొరత.. కేంద్రం ప్రత్యేక కమిటీ

    కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల క్రమబద్దీకరణపై కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. గృహ వినియోదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతానికి ప్రాధాన్యతాక్రమంలో గ్యాస్ సరఫరాకు ఆదేశాలు జారీ చేశారు. ఇతర దేశాల నుంచి LPG, LNG కార్గోల ద్వారా గ్యాస్ సేకరించాలని నిర్ణయించారు. నౌకల నిలిపివేతతో నిన్నటికి దేశంలో 40 భారీ క్రూడ్ క్యారియర్ల కొరత ఏర్పడింది. సాధ్యమైనంత త్వరలో పరిస్థితిని చక్కదిద్దేందుకు మోదీ ఆదేశాలు జారీ చేశారు.

  • 15 Mar 2026 07:45 AM (IST)

    గ్యాస్ సిలిండర్లను కూడా కాపాడుకోవాల్సిందే బాసూ..

    దేశంలో గ్యాస్‌ దొంగలు పడ్డారు. ఇంటికి తాళం వేసి ఉన్నా.. ఇంట్లో ఎవరు లేకపోయినా అదును చూసి ఎల్‌పీజీ సిలిండర్లను ఇట్టే లేపేస్తున్నారు. ఒక్క సిలిండరైనా.. వందలాది సిలిండర్లకయినా సరైన సెక్యూరిటీ లేకపోతే ఇట్టే మాయమైపోతున్నాయ్. ఉల్లిపాయలు, టమోటాలు ధరలు పెరిగినప్పుడు వాటిని ఎలా బంగారంలా కాపాడుకుంటామో ఇప్పుడు వంటగ్యాస్ సిలిండర్లను కూడా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందేనా?

  • 15 Mar 2026 07:26 AM (IST)

    హర్మూజ్‌ జలసంధి నుంచి భారత్‌కు మరో రెండు నౌకలు

    హర్మూజ్‌ జలసంధిలోని భారత్‌కు చెందిన LPG నౌకలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే.. ఓ నౌక భారత్‌కు చేరుకోగా.. ఇప్పుడు మరో రెండు LPG నౌకలు కూడా ఒకట్రెండు రోజుల్లో గుజరాత్‌కు రాబోతున్నట్లు కేంద్రం వెల్లడించింది. గ్యాస్‌ను వివిధ మార్గాల్లో భారత్‌కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు స్ఫష్టం చేసింది

  • 15 Mar 2026 07:11 AM (IST)

    వంటగ్యాస్‌ కష్టాల వేళ ప్రభుత్వం కీలక ప్రకటన

    దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ కష్టాల వేళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

    దేశంలో ఇంధన కొరత లేదన్న కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు.

    గ్యాస్‌ సరఫరాలో ఇబ్బందుల్లేవని.. ఈ పరిణామాలను కేంద్రప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని.. గోయల్‌ తెలిపారు.

Follow Us