వారిద్దరినీ తప్పక ఆహ్వానిస్తాం, అయోధ్య ట్రస్ట్

ఆగస్టు 5 న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి జరిగే భూమిపూజకు హాజరు కావలసిందిగా బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను ఫోన్ ద్వారా తప్పకుండా ఆహ్వానిస్తామని..

వారిద్దరినీ తప్పక ఆహ్వానిస్తాం,  అయోధ్య ట్రస్ట్

Edited By:

Updated on: Aug 01, 2020 | 4:36 PM

ఆగస్టు 5 న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి జరిగే భూమిపూజకు హాజరు కావలసిందిగా బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీలను ఫోన్ ద్వారా తప్పకుండా ఆహ్వానిస్తామని ‘అయోధ్య ట్రస్టుకు’  చెందిన వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి సంబంధించి మరో ఇద్దరు నేతలు ఉమా భారతి, కళ్యాణ్ సింగ్ లకు ఆహ్వానాలు వెళ్లాయని, కానీ అద్వానీ, ఎం.ఎం.జోషీలకు వెళ్లలేదని మొదట వార్తలు వచ్చాయి.  అయితే దీనిపై పార్టీలో దుమారం రేగడంతో.. ఇతర నేతలను ఇన్వైట్ చేసినట్టుగానే వీరిని కూడా ఆహ్వానిస్తామని ఈ వర్గాలు పేర్కొన్నాయి. రామ జన్మ భూమి క్షేత్ర తీర్థ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ ఆహ్వానాలను సమన్వయం చేస్తున్నారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us