Gold KYC: బంగారం కొనుగోళ్లపై ఎలాంటి కేవైసీ అవసరం లేదు.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ

|

Jan 09, 2021 | 6:07 AM

Gold KYC: బంగారం కొనుగోళ్లలో రూ.2 లక్షల లోపు నగదు లావాదేవీలకు కేవైసీ (వినియోగదారుల ధృవీకరణ) వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం...

Gold KYC: బంగారం కొనుగోళ్లపై ఎలాంటి కేవైసీ అవసరం లేదు.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ
Follow us on

Gold KYC: బంగారం కొనుగోళ్లలో రూ.2 లక్షల లోపు నగదు లావాదేవీలకు కేవైసీ (వినియోగదారుల ధృవీకరణ) వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం నగదుతో రూ.2 లక్షలు, అంతకు పైగా విలువ చేసే బంగారం, వెండి, విలువైన రాళ్ల కొనుగోలకు మాత్రమే ఆధార్‌, పాన్‌ కార్డు తదితర కేవైసీ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది.

మనీలాండరింగ్‌ నిరోధక చట్టం 2002లో భాగంగా గత సంవత్సరం డిసెంబర్‌ 28న రెవెన్యూశాఖ జారీ చేసిన ఓ నోటిఫికేషన్‌కు సంబంధించి ఆర్థిక శాఖ ఈ వివరణ ఇచ్చుకుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రూ.10 లక్షలు, అంతకు పైగా విలువ చేసే బంగారం, వెండి, ఇతర విలువైన లోహాలు, రాళ్ల కొనుగోలుకు నగదు చెల్లింపులు జరిపే వినియోగదారులు, లేదా సంస్థలకు మాత్రమే కేవైసీ తప్పనిసరి అని కేంద్ర మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

రూ.50 వేల దిగువన బంగారం

కాగా, బంగారం ధర రూ.50 వేల దగువకు చేరింది. ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.614 తగ్గి, రూ.49,763 నమోదైంది. అలాగే వెండి ధర కూడా రూ. 1609 తగ్గి రూ.67,518కి చేరుకుంది. అంతర్జాతీయంగా వీటి ధర తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

SBI Offers: ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. గృహ రుణాలపై వడ్డీ రాయితీ.. మార్చి వరకు ప్రాసెసింగ్‌ చార్జీలు రద్దు