రూ.25 కోట్లతో నిర్మించి 3 నెలల క్రితం ప్రారంభించిన అండర్‌పాస్‌ కుప్పకూలిపోయింది.. మరీ ఇంత ఘోరమా..!

దాదాపు రూ. 25 కోట్ల వ్యయంతో 2019లో ఈ పని ప్రారంభమైంది. మూడు నెలల క్రితమే ఈ రహదారిని ప్రారంభించారు. అయితే ఇప్పుడు అది కుప్పకూలింది.

రూ.25 కోట్లతో నిర్మించి 3 నెలల క్రితం ప్రారంభించిన అండర్‌పాస్‌ కుప్పకూలిపోయింది.. మరీ ఇంత ఘోరమా..!
Underpass

Updated on: Oct 10, 2022 | 1:45 PM

బెంగళూరు : మూడు నెలల క్రితం ప్రారంభించిన అండర్‌పాస్‌ కుప్పకూలింది. బెంగళూరులో కుండలహళ్లి సమీపంలో రూ.25 కోట్లతో నిర్మించిన అండర్‌పాస్‌ కూలిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40% కమీషన్ కుంభకోణం ఎఫెక్ట్ ఇది అంటూ ప్రజలు, కాంగ్రెస్ నేతలు ట్విట్టర్ లో వేదికగా మండిపడుతున్నారు. హూడి ప్రధాన రహదారి, ఐటీపీఎల్ ప్రధాన రహదారిని కలిపే కుండనహళ్లి అండర్‌పాస్‌కు ఎగువన ఉన్న రోడ్డు కుప్పకూలిందని, బెంగళూరు మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు పైపులైన్ లీకేజీ కారణంగా రోడ్డు కుంగిపోయిందని బీబీఎంపీ అధికారులు తెలిపారు. రోజురోజుకు అండర్ పాస్ పై రోడ్డు కుప్పకూలుతోంది.

దాదాపు రూ. 25 కోట్ల వ్యయంతో 2019లో ఈ పని ప్రారంభమైంది. మూడు నెలల క్రితమే ఈ రహదారిని ప్రారంభించారు. అయితే ఇప్పుడు అది కుప్పకూలింది. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు పైప్‌లైన్ మరమ్మతు పనులు చేసింది. కూలిన రోడ్డుపై అధికారులు కంకర వేశారు. పైప్‌లైన్ లీకేజీ కారణంగా కొన్ని చోట్ల కావేరి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కుప్పకూలిన రోడ్డు మరమ్మతులకు మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అండర్‌పాస్ వార్షిక నిర్వహణ, లోపభూయిష్ట బాధ్యత నిబంధన కింద కవర్ చేయబడినందున, కుప్పకూలిన రహదారిని మరమ్మతు చేయడానికి కాంట్రాక్టర్ ఎటువంటి రుసుమును వసూలు చేయలేరు. ఉచితంగా చేస్తామని బీబీఎంపీ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

జరిగిన ఘటనపై కాంగ్రెస్‌ నేత నాగరాజ్‌ యాదవ్‌ మాట్లాడుతూ. ఇది అవినీతికి మరో ఉదాహరణ అన్నారు. కాంట్రాక్టర్లు, ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని శాసనమండలి సభ్యుడు యాదవ్‌ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై స్వయంగా బెంగళూరు ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..