పదేళ్లలో 4 రెట్లు పెరిగిన ఎన్నికల ఖర్చు.. ఓటర్లకు విచ్చల విడిగా డబ్బు పంపకం.. మరి ఈసారి.?

| Edited By: TV9 Telugu

May 16, 2024 | 4:16 PM

2012లో పూరీ జగన్నాథ్ డైరక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా మీలో ఎంత మంది చూశారు..? చూడకపోతే... ఇది ఎలక్షన్ టైం కనుక.. ఓ సారి ఎలక్షన్ కోసం.. ఎన్నికల్లో అయ్యే ఖర్చుల కోసం మహేశ్ బాబు చెప్పే డైలాగ్స్ ఓ సారి గుర్తు చేస్తా. ఢిల్లీ నుంచి హైకమాండ్ దూత వచ్చినప్పుడు ఎన్నికల ఖర్చు లెక్కల గురించి మహేశ్ సూపర్ డైలాగ్‌ చెబుతాడు.

పదేళ్లలో 4 రెట్లు పెరిగిన ఎన్నికల ఖర్చు.. ఓటర్లకు విచ్చల విడిగా డబ్బు పంపకం.. మరి ఈసారి.?
Follow us on

2012లో పూరీ జగన్నాథ్ డైరక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బిజినెస్ మ్యాన్ సినిమా మీలో ఎంత మంది చూశారు..? చూడకపోతే… ఇది ఎలక్షన్ టైం కనుక.. ఓ సారి ఎలక్షన్ కోసం.. ఎన్నికల్లో అయ్యే ఖర్చుల కోసం మహేశ్ బాబు చెప్పే డైలాగ్స్ ఓ సారి గుర్తు చేస్తా. ఢిల్లీ నుంచి హైకమాండ్ దూత వచ్చినప్పుడు ఎన్నికల ఖర్చు లెక్కల గురించి మహేశ్ సూపర్ డైలాగ్‌ చెబుతాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యాన్ని ఉద్ధేశిస్తూ అన్నీ ఛండీగఢ్, ఛత్తీస్ గఢ్‌ లెక్కలు చెబుతావేంటి… ఇప్పుడు ఓటు 500కి రాదు.. ఒక్కోసెంటర్లో 5 వేలు కూడా పెట్టి కొనాల్సి ఉంటుంది అని… మొత్తంగా ఖర్చు 2012లోనే 35వేల కోట్లు అని చెబుతాడు మహేశ్ బాబు. ఒక్కసారి నిన్నగాక మొన్న అంటే ఓ 4 నెలల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఓటుకు 5 వేలు ఇచ్చిన ఊళ్లు ఉన్నాయా .. లేవా… ఇప్పటికిప్పుడు సాక్ష్యాలు చూపించమంటే వల్ల కాదు కానీ.. ఇచ్చిన పార్టీలకు తెలుసు… తీసుకున్న జనాలకు తెలుసు. అంతెందుకు 2019 సార్వత్రిక ఎన్నికలకు అయిన ఖర్చు ఎంతో తెలుసా.. అక్షరాల సుమారు 60 వేల కోట్లు. అంటే 2012లో డైరక్టర్ పూరీ వేసిన లెక్కలు కరెక్టేనని అనిపిస్తోంది కదా…! సరే 2019లో జరిగిన ఎన్నికల ఖర్చు గురించి ఏ న్యూస్ పేపరో… ఏ సోషల్ మీడియానో.. లేదా టీవీ ఛానెళ్లో చెప్పిన లెక్కలు కావు....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి