రైలు టికెట్ ఎన్ని రోజులు ముందుగా బుక్ చేసుకోవచ్చు..! ఆ వివరాలు తెలుసుకోండి..

Train Ticket Details: అసలే కరోనా కాలం.. ఆపై దేశవ్యాప్తంగా స్పెషల్ ట్రైన్స్ తిరుగుతుండటంతో టికెట్లు అంత ఈజీగా దొరకని..

రైలు టికెట్ ఎన్ని రోజులు ముందుగా బుక్ చేసుకోవచ్చు..! ఆ వివరాలు తెలుసుకోండి..

Updated on: May 06, 2021 | 3:12 PM

Train Ticket Details: అసలే కరోనా కాలం.. ఆపై దేశవ్యాప్తంగా స్పెషల్ ట్రైన్స్ తిరుగుతుండటంతో టికెట్లు అంత ఈజీగా దొరకని పరిస్థితి. మనం దూర ప్రాంతాలకు వెళ్లాలనుకున్నప్పుడు ముందుగానే రైలు టికెట్లు రిజర్వేషన్ చేసుకోవాల్సి వస్తుంది. తద్వారా ఎలాంటి సమస్య లేకుండా అనుకున్న రోజు ప్రయాణం చేయవచ్చు. అయితే చాలామందికి రిజర్వేషన్ టికెట్లు ఎన్ని రోజులు ముందు బుక్ చేసుకోవాలన్నది తెలియదు. ఒకవేళ ఆలస్యంగా టికెట్లు తీసుకుంటే సీట్/బెర్త్ దొరకపోవచ్చు. అందువల్ల మీ ప్రయాణానికి టికెట్లు ఎన్ని రోజులు ముందు బుక్ చేసుకోవచ్చు అనే విషయాలను తెలుసుకుందాం…

టికెట్లను 120 రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు…

సాధారణంగా రైలు టికెట్లను 120 రోజులు ముందుగా బుక్ చేసుకోవచ్చు. అంటే, మీ ట్రిప్‌కు 4 నెలల ముందు టికెట్లను రిజర్వు చేసుకోవచ్చు. ఇక గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ సమయంలో, ఈ పరిమితిని ఒక నెలకు కుదించారు. అయితే ఆ తర్వాత మేలో, మళ్లీ పాత పద్దతికి మార్చేశారు. ఇక ఈ విషయం చాలామంది తెలియదు. మనం టికెట్లను మునపటి మాదిరిగానే 120 రోజులు ముందుగా బుక్ చేసుకోవచ్చు

రైలు బయల్దేరే ముందు ఎన్ని గంటల వరకు టికెట్ బుక్ చేసుకోవచ్చు.?

అత్యవసర ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు మీరు టికెట్ ను రైలు బయల్దేరడానికి అరగంట ముందులోగా బుక్ చేసుకోవచ్చు. సాధారణంగా రైలు బయల్దేరే నాలుగు గంటల ముందు చార్ట్ ప్రిపేర్ అవుతుంది. మీరు ఆన్‌లైన్‌లో లేదా రిజర్వేషన్ కౌంటర్ ద్వారా అరగంట ముందుగా అడ్వాన్స్ గా టికెట్లు తీసుకోవచ్చు.

డూప్లికేట్ టికెట్లు ఎలా పొందవచ్చు.?

కరోనా కారణంగా ఈ మధ్యకాలంలో చాలామంది ఈ-టికెట్లకే ఎక్కువ ప్రాధ్యానత ఇస్తున్నారు. తమ ఫోన్ల ద్వారా టీసీలకు పీఎన్ఆర్ నెంబర్ ను చూపిస్తున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల ఆ ఈ-టికెట్ పోయినట్లయితే.. టికెట్ కలెక్టర్ (టీటీఈ)కు 50 రూపాయల ఫైన్ చెల్లించి మీరు టికెట్ పొందవచ్చు. దానికోసం మీ ఐడీ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. అలాగే డూప్లికేట్ టికెట్ పొందడానికి, మీరు రిజర్వేషన్ కౌంటర్ కు వెళ్లి టికెట్ పోయిందన్న దానిపై లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇవి చదవండి:

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?