Kisan Credit Card: రైతులకు రూ.3 లక్షల వరకు లోన్.. నిమిషాల్లోనే అకౌంట్లోకి.. ఎలంటి హామీ అక్కర్లేదు..

రైతులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోంది. బ్యాంక్ నుంచి రూ.3 లక్షల వరకు లోన్ అందిస్తోంది. అతి తక్కువ వడ్డీతో, ఎలాంటి హామీ లేకుండానే వీటిని ఇస్తోంది. దేశంలోని రైతులందరూ ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ పథకం వివరాలు ఒకసారి చూద్దాం.

Kisan Credit Card: రైతులకు రూ.3 లక్షల వరకు లోన్.. నిమిషాల్లోనే అకౌంట్లోకి.. ఎలంటి హామీ అక్కర్లేదు..
Kisan Credit Card

Updated on: Feb 15, 2026 | 1:23 PM

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. పీఎం కిసాన్ ద్వారా ఏడాదికి రూ.6 వేల చొప్పున సాయం అందిస్తోంది. ఇక రైతులకు పంట బీమా, జీవిత బీమా వంటి సౌకర్యాలు కల్పిస్తోంది. ఇక ఎరువులు, యంత్రీకరణ పరికరాలపై రాయితీలు కూడా కల్పిస్తోంది. ఇదే కాకుండా రైతులకు సాగు పెట్టుబడి కోసం అతి తక్కువ వడ్డీకే బ్యాంక్ రుణం అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీని పేరే కిసాన్ క్రెడిట్ కార్డ్. ఎలాంటి హామీ లేకుండానే రైతులు రూ.3 లక్షల వరకు రుణం పొందవచ్చు. వీటిని తమ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ పథకానికి ఎవరు అర్హులు..? ఏయే పత్రాలు అవసరం..? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే విషయాలు చూద్దాం.

వడ్డీ ఎంతంటే..?

కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా రైతులు బ్యాంకుల ద్వారా తీసుకునే రుణంపై బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. కానీ కేంద్ర ప్రభుత్వం 3 శాతం వడ్డీని చెల్లిస్తుంది. మిగతా 4 శాతం వడ్డీ రైతులు చెల్లిస్తే సరిపోతుంది. ఏడాదిలోపు చెల్లించినవారికి మాత్రమే వడ్డీలో రాయితీ పొందే సౌకర్యం ఉంటుంది. ఏడాది తర్వాత చెల్లిస్తే పూర్తి వడ్డీ కట్టాల్సి ఉంటుంది. దీని వల్ల రైతులకు అదనపు భారం పడుతుంది.

అర్హతలు ఏంటంటే..?

-18 నుంచి 75 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి

-సొంత భూమి కలిగి ఉండాలి

-మీ పేరుపై భూమి ఎంత ఉన్నా తీసుకోవచ్చు

-స్వయం సహాయక సంఘాల సభ్యులు కూడా అర్హులే

-పశుపోషణ లేదా చేపటవేట చేసేవారు కూడా పొందే సౌకర్యం

కావాల్సిన డాక్యుమెంట్స్

-ఆధార్ కార్డ్

-బ్యాంక్ అకౌంట్ వివరాలు

-పాస్ పోర్ట్ సైజు ఫొటోలు

-పట్టాదారు పాస్ బుక్‌లు

దరఖాస్తు ఎలా..?

మీ సమీపంలోని ఏదైనా బ్యాంక్‌కి వెళ్లి తీసుకోవచ్చు. అక్కడికి వెళ్లి దరఖాస్తు పూర్తి చేస్తే మీకు రుణ పరిమితి అందిస్తారు. మీకు అవసరమైనప్పుడు బ్యాంక్‌కి వెళ్లి నగదు తీసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ఆన్‌లైన్ విధానంలో కూడా కిసాన్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్ https://www.jansamarth.in/home ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఆస్తులు తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ లోన్‌కు అవేమీ అవసరం లేదు. ఎలాంటి హామీ పెట్టుకుండానే రూ.3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. పంట పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బంది పడే రైతులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us