Operation Torre del Oro: 700 మంది ఏకకాలం దాడి.. లెక్క తేలని 120 కిలోల బంగారం స్వాధీనం..!

|

Oct 24, 2024 | 3:39 PM

GST విభాగం 700 మందికి పైగా అధికారులతో భారీ రైడ్‌ను నిర్వహించింది. బంగారం తయారీ కేంద్రాలు, నగల దుకాణాలు, జెవెల్లరీ షాపులపై దాడులు నిర్వహించారు.

Operation Torre del Oro: 700 మంది ఏకకాలం దాడి.. లెక్క తేలని 120 కిలోల బంగారం స్వాధీనం..!
Gst Intelligence Raid In Thrissur
Follow us on

కేరళ రాష్ట్రంలో జీఎస్టీ విభాగం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించింది. ఆ రాష్ట్రంలో జీఎస్టీ నిర్వహించిన అతిపెద్ద రైడ్ త్రిసూర్‌లో కొనసాగింది. త్రిసూర్ నగరంలో అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం ప్రారంభమైన ఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నగరంలోని బంగారం తయారీ కేంద్రాలు, దుకాణాలు, నగల దుకాణాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పటి వరకు 120 కిలోలకు పైగా లెక్కలోకి రాని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదేళ్లుగా జీఎస్టీ ఎగవేత జరిగినట్లు గుర్తించామని జీఎస్టీ ఇంటెలిజెన్స్ డిప్యూటీ కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు.

త్రిసూర్ నగరంలో తనిఖీలు నిర్వహించేందుకు 74 కేంద్రాల్లో 700 మంది అధికారులను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద జీఎస్టీ ఆపరేషన్ పేరు ‘టోర్రే డెల్ ఓరో’. టోర్రే డెల్ ఓరో అనేది స్పెయిన్‌లోని చారిత్రక గోల్డెన్ టవర్ పేరు. బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన తనిఖీలు అర్థరాత్రి వరకు కొనసాగి గురువారం కూడా కొనసాగాయి. జ్యువెలరీ షాపు యజమానుల ఇళ్లపైనా దాడులు చేశారు.

రాష్ట్ర జీఎస్టీ స్పెషల్ కమిషనర్ రన్ ఇబ్రహీన్ నేతృత్వంలో తనిఖీలు కొనసాగాయి. ఆహ్లాద యాత్ర, ఆలయ దర్శనం, జీఎస్టీ శిక్షణ తదితర కారణాలతో రాష్ట్రంలోని దాదాపు 700 మంది అధికారులను త్రిసూర్‌కు తీసుకొచ్చి ఈ భారీ రైడ్‌ నిర్వహించారు. ప్రధానంగా నగరంలోని హోల్ సేల్ వ్యాపార కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..