AAP Maha Rally: సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం ధిక్కరించింది.. రాంలీలా మైదానంలో ఆప్‌ ర్యాలీలో కేజ్రీవాల్‌..

|

Jun 11, 2023 | 2:13 PM

AAP MahaRally At Ramlila Maidan: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాంలీలా మైదాన్ నుంచి ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధానిని అహంకార నియంత అని మండిపడ్డారు.

AAP Maha Rally: సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం ధిక్కరించింది.. రాంలీలా మైదానంలో ఆప్‌ ర్యాలీలో కేజ్రీవాల్‌..
Kejriwal
Follow us on

ఢిల్లీ, జూన్ 11:  ఢిల్లీ పాలనాధికారాలు లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై కేజ్రీవాల్‌ యుద్దాన్ని తీవ్రతరం చేశారు. ఢిల్లీ రాంలీలా మైదానంలో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా లక్షలాదిమందితో ఆప్‌ ర్యాలీ నిర్వహించింది. 12 ఏళ్ల తరువాత రాంలీలా మైదానంలో భారీ సభను ఏర్పాటు చేసింది. కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు సీఎం కేజ్రీవాల్‌. ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేకుండా , నియంతృత్వం ఉండేలా ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని పార్టీలు ఉద్యమించాలన్నారు. 12 ఏళ్ల క్రితం ఇదే వేదిక దగ్గర అవినీతికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించామని , ఇప్పుడు ప్రజాస్వామ్యం కోనం ఉద్యమిస్తునట్టు తెలిపారు కేజ్రీవాల్‌.

తమ నేతలను జైల్లో వేసి , ఆప్‌ కార్యకర్తలను భయపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు కేజ్రీవాల్‌. ఆప్‌ దగ్గర 100 మంది సిసోడియాలు ఉన్నారన్నారు. ఢిల్లీ ప్రజల హక్కులను కాలరాస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మోదీ ప్రభుత్వం తిరస్కరించిందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అంగీకరించబోమని ప్రధాని చెప్పారని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రజల ఓట్లను నేను గౌరవించను.

కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ర్యాలీకి పిలుపునిచ్చింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పని చేయడానికి అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ కూడా ర్యాలీలో పాల్గొన్నారు.

ర్యాలీకి హాజరైన కపిల్ సిబల్‌కు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ ప్రజలు నన్ను రోజూ దుర్భాషలాడుతున్నారని కపిల్‌ సిబల్‌ అన్నారు. నన్ను అవమానించండి కానీ నా అవమానాన్ని నేను పట్టించుకోను. నేను ఢిల్లీ ప్రజల కోసం పోరాడుతున్నాను. సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఈ ఆర్డినెన్స్‌ను 140 కోట్ల మంది ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం