Viral News: పొద్దున్నే హాస్టల్ బాత్రూంలోంచి గట్టిగా అరుపులు.. అమ్మాయిలు వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్!

కర్ణాటక రాష్ట్రంలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రభుత్వ బాలికల హాస్టల్‌లోని వాష్‌రూమ్‌లో 10వ తరగతి విద్యార్థిని మగబిడ్డకు జన్మనివ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక గర్బవతి అయ్యేందుకు కారణమైన యువకుడితో పాటు.. నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలతో ఐదుగురు హాస్టల్ సిబ్బందిపై కేసు నమోదు చేశారు.

Viral News: పొద్దున్నే హాస్టల్ బాత్రూంలోంచి గట్టిగా అరుపులు.. అమ్మాయిలు వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్!
Viral News

Updated on: Nov 28, 2025 | 1:21 PM

ప్రభుత్వ బాలికల హాస్టల్‌లోని వాష్‌రూమ్‌లో 10వ తరగతి విద్యార్థిని మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కుకనూర్ పీఎస్‌ పరిధిలో వెలుగు చూసింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ఘటనపై కేసు నయోదు చేసుకున్న పోలీసులు.. బాలిక గర్బవతి అయ్యేందుకు కారణమైన యువకుడితో పాటు నిర్లక్ష్యం వహించారనే ఆరోపణపై కుకనూర్ స్టేషన్‌లో వార్డెన్, ఉపాధ్యాయులు, వైద్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుకునూర్‌లోని బాలికల హాస్టల్‌లో ఒక విద్యార్థిని 10వ తరగతి చదువుతుంది. అయితే ఆమె గత ఏప్రిల్‌ నెలలో తన స్వగ్రామమైన తాళ్లూరుకు వెళ్లినప్పుడు.. అదే గ్రామానికి చెందిన హనుమగౌడ అనే 23 ఏళ్ల యువకుడు బాలికపై పలు మార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. అయితే గ్రామం నుంచి తిరిగి హాస్టల్‌కు వచ్చిన బాలికకు బుధవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ప్రసవ నొప్పులు వచ్చాయి. దీంతో ఆమె హాస్టల్ వాష్‌రూమ్‌లోకి వెళ్లి అక్కడే మగ బిడ్డకు జన్మనిచ్చింది.

తోటి విద్యార్థుల సమాచారంతో బాలికను హాస్పిటల్‌కు తరలించారు హాస్టల్ సిబ్బంది. అయితే విషయం తెలుసుకున్న జిల్లా బాలల సంరక్షణ అధికారి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న కుకనూర్ పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వీరిలో నిందితుడు హనుమగౌడ, ఐదుగురు సిబ్బంది ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై కొప్పల్ ఎస్పీ రామ్ అరసిద్ది మాట్లాడుతూ.. నిందితుడు హనుమగౌడను అరెస్టు చేశామని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురి సిబ్బందిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రస్తుతం హనుమగౌడను జ్యుడీషియల్ కస్టడీకి పంపామని.. బాలికకు వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.