Karnataka Heavy Rains: కర్ణాటకలోని పలు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తాయి. వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్ర రాజధాని నగరం బెంగుళూరులోని పలు లోతట్టు ప్రాంతాలు సైతం జలమయం అయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారంనాడు కర్ణాటకలో వరదల పరిస్థితిపై సమీక్షించారు. భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకుని ఆ రాష్ట్రంలో దాదాపు 24 మంది మృతి చెందినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. అలాగే 5 హెక్లార్లలోని పంటలు నీటమునిగాయి. 658 ఇళ్లులు పూర్తిగా ధ్వంసంకాగా.. 8,495 ఇళ్లులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 191 మూగజీవాలు వరదల్లో చిక్కుకుని మృత్యువాతపడ్డాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిలు, స్కూల్స్, పబ్లిక్ హెల్త్ సెంటర్‌లు దెబ్బతిన్నాయి.
బెంగళూరు అర్బన్, రూరల్, తుమకూరు, కోలాల్, చిక్కబల్లాపూర్, రామనగర్, హాసన్ జిల్లాల్లో నష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర సహాక చర్యల నిమిత్తం రూ.689 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ నిధులను జిల్లా కలెక్టర్లకు విడుదల చేశారు. అవసరమైతే మరిన్ని నిధులను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
బెంగుళూరులోని కేంద్రియ విహార్ అపార్ట్‌మెంట్‌లో నిలిచిన వర్షపు నీరు..
#WATCH | Karnataka: Parts of Bengaluru face waterlogging due to rainfall in the region. Visuals from outside Kendriya Vihar apartment in Bengaluru. pic.twitter.com/qwXjtQNpBL
— ANI (@ANI) November 22, 2021
కేంద్రియ విహార్ అపార్ట్‌మెంట్‌లో బోటుల సాయంతో సహాయక చర్యలు..
Boats arrive at Kendriya Vihar Apartments in Yelahanka. #BengaluruRains pic.twitter.com/dQra8mCyjv
— DP SATISH (@dp_satish) November 22, 2021
Also Read..
Viral Photo: దాగుడుమూతలు ఆడుతోన్న పిల్లిని గుర్తించండి.. అదెక్కడుందో కనిపెట్టండి కష్టం బాసూ.!